Bigg Boss 8: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగో వారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు 25వ రోజుకు సంబంధించిన తొలి ప్రోమోను విడుదల చేశారు. ఇందులో బిగ్ బాస్ ఆసక్తికరంగా బెలూన్ టాస్క్ పెట్టారు. అయితే ఈ టాస్క్ లో కంటెస్టెంట్లు మునిగిపోయేలా చేసి, విష్ణు ప్రియపై ఉన్న ప్రేమను పృథ్వీ బయట పెట్టేలా చేశాడు బిగ్ బాస్. ఇంకా ఈ ప్రోమోలో నెలకొన్న ఇంట్రెస్టింగ్ విషయాలు.. అసలు పృథ్వీ విష్ణుల మధ్య లవ్ ట్రాక్ గురించి తెలుసుకుందాం.
గత ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి మరో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నారని బిగ్ బాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. వారిని హౌస్‌లోకి రాకుండా చేయాలంటే 12 టాస్క్‌లను విజయవంతంగా హౌస్ మేట్స్ గెలవాల్సిందే. ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ కు రెండు టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో బాల్ పట్టు.. టవర్ లో పెట్టు టాస్క్ లో గెలిచి 12వ వైల్డ్ కార్డు హౌసులోకి రాకుండా అడ్డుకున్నారు. మరో టాస్క్ లో మనిషి తినలేనంత తిండి పెట్టాడు. అందులో రెండు క్లాన్లకు చెందిన నలుగురు పాల్గొనినప్పటికీ ఓడిపోయారు. దీంతో కంటెస్టెంట్లు ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపలేకపోయారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా.. ‘‘పట్టుకోండి.. లేకుంటే పగిలిపోతుంది’’ అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కాంతారా టీం నుంచి నబీల్, శక్తి టీం నుంచి పృథ్వీ పాల్గొన్నారు. వీరిద్దరూ కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తికరమైన ప్రోమోను రూపొందించారు.
ఫ్రేమ్ మీద హ్యాండిల్ కి కట్టి ఉన్న మేకు బెలూన్ కి తగలకుండా చూసుకోవాలి హౌస్మేట్స్.. అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా టాస్క్ సీరియస్ గా జరుగుతుండగా మణికంఠ పాట పాడుతుండగా లేడీ కంటెస్టెంట్స్ అంతా నవ్వుతూ కనిపించారు. ఇంతలో.. బిగ్ బాస్ హఠాత్తుగా పృథ్వీని ఓ పాట పాడమని ఆదేశించాడు. పృథ్వీ మన కోసం ఓ పాట పాడగానే బిగ్ బాస్ ‘ఎవరెవరో నాకెదురైనా’ అంటూ యానిమల్ సినిమా నుండి పాట పాడడం ప్రారంభిస్తారు. పోటీలో ఉన్న నబిల్ అందుకుని హౌస్‌లో ఈ పాట ఎవరికోసం పృథ్వీ పాడుతున్నారో అడగండి బిగ్ బాస్ అని అడిగారు. వెంటనే పృథ్వీ విష్ణు ప్రియ కోసమే అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే చాలా రోజుల నుంచి పృథ్వీతో.. లవ్ ట్రాక్ కోసం విష్ణు ప్రియ మొదటి రోజు కాఫీ ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెట్టి ఇంకా ట్రై చేస్తున్నట్లు కనిపించింది. ఈ మాట విని తెగ సంతోష పడిపోయింది. మొత్తానికి ఇన్ని రోజులకు విష్ణు ప్రియపై పృథ్వీ తన ప్రేమను కురిపించాడు. అయితే జస్ట్ ఫన్ కోసమే చెప్పాడా ? లేదంటే లవ్ ట్రాక్ మొదలు అవుతుందా అనేది చూడాలి.