Tuesday, October 8, 2024

Bigg Boss 8 : మెగాస్టార్ మాజీ అల్లుడితో బిగ్ బాస్ సోనియా సీక్రెట్ ఎఫైర్.. నిజమా ?

- Advertisement -


Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్‌గా వచ్చిన సోనియా గురించిన నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. హౌస్‌లోకి అడుగుపెట్టి అందరి మీద అరుస్తూ గొడవలు సృష్టిస్తున్న సోనియా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొన్నటి వరకు ఆమెకు పెళ్లి అయింద‌న్న వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. ఇప్పుడేమో ఆమె చాలా మంది సెలబ్రిటీలతో ఎఫైర్ నడుపుతోందనే వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. మెగాస్టార్ మాజీ అల్లుడితో బిగ్ బాస్ సోనియా ఎఫైర్ నడుపుతోందని, కొన్ని కారణాల వల్ల వారి పెళ్లి ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకుందాం…

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన కుటుంబాన్ని ఎదిరించి శిరీష్ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పెళ్లి సమయంలో జరిగిన రచ్చ ఎంతగా వైరల్‌గా మారిందో తెలిసిందే. అంత పెద్ద కుటుంబానికి చెందిన వారైనా.. మీడియాను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న శ్రీజ కొన్ని రోజులు భర్తతో బాగానే ఉంది. అయితే ఆ తర్వాత కట్నం కోసం వేధిస్తున్నాడని భర్తకు విడాకులు ఇచ్చి తండ్రి వద్దకు వెళ్లింది.. శిరీష్ భరద్వాజ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది.. బిగ్ బాస్ 8 షోలో కంటెస్టెంట్‌గా ఉన్న ఆకుల సోనియాతో శిరీష్ భరద్వాజ్ ఎఫైర్ నడిపారనే వార్త వైరల్ అవుతోంది. సోనియా, శిరీష్ భరద్వాత్ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే వీరిద్దరి మధ్య స్నేహం ఎలా బయటపడిందని అనుకుంటున్నారా? శిరీష్ భరద్వాజ్ మరణం తర్వాత సోనియా సంచలన పోస్ట్‌ను షేర్ చేశారు. ఆయన మృతి పట్ల సోనియా చాలా బాధపడ్డారని అందులో పేర్కొన్నారు. శిరీష్‌ చనిపోయిన సమయంలో పెద్దగా ఎవరికీ ఆమె తెలియదు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఫైర్‌బ్రాండ్‌ కావడంతో నెటిజన్లు ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు.. ఇంకా ఎంతమందితో రిలేషన్‌షిప్‌లో ఉందో అంటూ ఫ్యాన్స్‌ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ తీరు చూస్తుంటే ఈ అమ్మడు ఈ వారం బయటకు వెళ్లనుందని టాక్..

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!