Friday, October 4, 2024

Bigg Boss 8: హగ్‌ల కోసమే వచ్చావా బిగ్ బాస్ కు.. మణికంఠను బండబూతులు తిడుతున్న నెటిజన్స్

- Advertisement -


Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతోంది. కానీ, ఈసారి హౌస్ మేట్స్ ఎంపిక సరిగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోలో ఎంట్రీ లేదు. 14 మందిని జంటగా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపారు. వారి మధ్య గొడవలు పెట్టి నామినేషన్స్ రోజు ఒకరికొకరు బండబూతులు తిట్టుకుంటూనే ఉంటారు.. బిగ్ బాస్ రూల్స్ అంటారు.. కానీ, ఒక్కరు కూడా పాటించరంటూ నెటిజెన్స్ ఈ షో మీద మండిపడుతున్నారు. బిగ్ బాస్ లో టాస్క్ లు, ఫైట్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జీవితాల్లోని కష్టాలను, వారి కుటుంబ సభ్యులను గుర్తు చేస్తూ భావోద్వేగానికి లోనవుతారు.

తెలుగులో ఏడు సీజన్లు వియవంతంగా పూర్తి చేసుకుని ఎనిమదవ సీజన్ కి ఇటీవలే షురూ అయింది. షో మొదలవ్వక ముందు వరకు టాక్ ఒకలా ఉంటుంది.. ఒక్కసారి మొదలయ్యాక టాక్ మొత్తం బయట మారిపోతుంది.
బిగ్ బాస్ ఇంట్లో హౌస్ మేట్స్ ఒకరిని ఒకరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు.. హౌసులో కంటెస్టెంట్లు పోటీపడుతుండగా వారి పోరుకు తగ్గట్లే బయట క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోతుంది.. ఇక ఈ సీజన్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ను మణికంఠ జనాల్లోకి బాగా ఎక్కించేశాడు..దీంతో వాళ్లు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఓట్లు తెగ గుద్దేశారు. దీంతో మనోడు ఓటింగులో రెండో ప్లేసులోకి దూసుకొచ్చాడు. అయితే , తాజాగా నెటిజెన్స్ మణికంఠ మీద షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ షో ఎప్పుడు ఎలా ఉంటుందో .. ఎవరు కూడా ఊహించలేరు. బిగ్ బాస్ సీజన్ సీజన్ కి మొత్తం మారిపోతుంది. ఈ సీజన్ అయితే రూల్స్ మొత్తం చేంజ్ చేశారు. సోలో ఎంట్రీ లేదంటూ జంటలుగా పంపించారు. వారిలో ఇక మణికంఠ అయితే మొదటి నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటూ కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక, తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎవరు కాస్త బాధగా కనిపిస్తే మనోడు పోయి హగ్ ఇస్తున్నాడు. ఇది చూసిన నెటిజన్స్ హాగ్ ల కోసం బిగ్ బాస్ లోకి వెళ్లావా లేక ఆట ఆడటానికి వెళ్లావా అంటూ మణికంఠను నెటిజెన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడం ఖాయమని తెలుస్తుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!