Thursday, October 3, 2024

Bigg Boss 8 : నేడు ఎలిమినేట్ కానున్న శేఖర్ బాషాకి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందో తెలుసా..?

- Advertisement -

Bigg Boss 8 : నేడు ఎలిమినేట్ కానున్న శేఖర్ బాషాకి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందో తెలుసా..?
Bigg Boss 8 : బిగ్ బాస్ అంటే ఊహించని సంఘటనలు జరుగుతాయి. అందుకే ప్రేక్షకుల ఊహకు అందని విధంగా అద్భుతమైన టాస్క్‌లు, ఊహించని ఎలిమినేషన్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది బిగ్ బాస్. మిగతా సీజన్‌లకు భిన్నంగా ఈ సీజన్ చాలా డిఫరెంట్‌గా ఇన్ఫినిటీ అనే పేరుతో ఎనిమిదో సీజన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు ఊహించని పరిణామాలు, ఊహించని టాస్కులు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొదటి వారంలో భాగంగా బెజవాడ బేబక్క సిల్లీ కారణాలతో ఎలిమినేట్ కాగా, ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ టైం కూడా వచ్చింది.

మొదటి వారంలో బేబక్కదే అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటే రెండో వారంలో ఈ ఎలిమినేషన్ ఎవరూ ఊహించరు కూడా. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు, వారిలో వీక్ కంటెస్టెంట్స్‌తో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. హౌసులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న శేఖర్ బాషా ఎలిమినేట్ కావడం అందరికి పెద్ద షాకే అని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో కాస్తో కూస్తో హౌస్‌లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది శేఖర్ బాషా మాత్రమే. వీక్లీ హౌస్‌లో చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ, శేఖర్ బాషా ఎలిమినేషన్ బిగ్ బాస్‌లో నిజంగా రాజకీయమే అని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

సాధారణంగా ప్రతి సీజన్‌లో ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్‌లు ఒకటి లేదా రెండు ఉంటాయి. అయితే ఈ సీజన్ ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న శేఖర్ బాషా ఎలిమినేట్ కావడం పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. నిజానికి శేఖర్ భాష కంటే వీక్ కంటెస్టెంట్స్ లేరని కాదు.. ఎందుకంటే శేఖర్ బాషా కంటే పృథ్వీ, ఆదిత్య, సీత వీక్ కంటెస్టెంట్స్ గా పరిగణించవచ్చు. సీత గత వారం అత్యుత్తమ ప్రదర్శనను అందించింది. అయితే ఆమెకు పీఆర్‌ టీం లేకపోవడంతో ఓట్లు పడలేదు. ఆదిత్య ఓం, పృథ్వీ శేఖర్ బాషా కంటే మెరుగ్గా నటించలేదు. అయితే ఇది ఊహించని ఎలిమినేషన్ అని వార్తలు వస్తున్నాయి.

ఇక ఏది ఎలా చూసుకున్నా మొత్తానికైతే శేఖర్ బాషా ఎలిమినేట్ అయిపోయారు. ఈరోజు హౌసు నుంచి తిరిగి వస్తున్న శేఖర్ బాషాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారన్న విషయం వైరల్ గా మారింది. మొదటి రోజు నుంచి ఈరోజు వరకు..అంటే 15 రోజులుగా హౌస్ లో ఉంటున్నాడు కాబట్టి మొత్తం 15 రోజులకు రూ.30 లక్షలు చొప్పున శేఖర్ బాషా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. అంటే రోజుకు రూ.2 లక్షలు అన్న మాట. మొత్తానికి హౌస్‌లోకి అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుని ఎవరూ ఊహించని ఎలిమినేషన్‌తో వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పొచ్చు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!