Bigg Boss 8 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పుడు ఎనిమిదో సీజన్ నడుస్తోంది. అయితే ఈ ఎనిమిదో సీజన్‌లో భాగంగా రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మూడో వారం కూడా మొదలైంది. 18వ రోజు ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమో మొదట భయపెట్టినా చివర్లో కంటతడి పెట్టించింది. మూడో వారంలో భాగంగా తొలి రెండు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కంటెస్టెంట్లు టాస్క్‌లు ప్రారంభించారు.
నిన్న బిగ్ బాస్ బెలూన్ గేమ్ అనే టాస్క్ నిర్వహించారు. ఈ గేమ్ తర్వాత యష్మీ చంద్రముఖిగా మారి అందరినీ భయపెట్టింది. కర్ర విరిగిపోతే గేమ్ ఆపాలని మీకు తెలియదా అంటూ సంచాలక్ పై విరుచుకుపడింది. సంచాలక్ ఆపారా అంటూ నిఖిల్ పై మండిపడింది. చంద్రముఖి లా మారిపోయి విచక్షణారహితంగా ఎదుటివారు చెబుతుంది వినకుండా.. నోటికొచ్చినట్టు వాగేసింది యష్మి. మీ కర్ర విరిగిపోతే నీ సంచాలక్ ఆపేసి మరీ కొట్టొద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిఖిల్ మధ్యలో కలుగజేసుకుని.. ముందు అరవడం ఆపు.. వాళ్లు చెప్పేది విను అంటూ ఎంత బ్రతిమిలాడినా సరే అలాగే పూనకం వచ్చిన దానిలా ఊగిపోయింది. నేను అరుస్తాను ఇలాగే అరుస్తాను ఇక్కడే అరుస్తానంటూ రెచ్చిపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న నిఖిల్ పక్కకి వెళ్లి అరువు నిన్ను ఎవరు అరవద్దన్నారు.. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ అంతే గట్టిగా ఆన్సర్ ఇస్తాడు.
ఆ తర్వాత జరిగిన గేమ్ గురించి.. అక్కడ జరిగిన గొడవ గురించి ప్రేరణతో డిస్కషన్ పెట్టింది యష్మి. సంచాలక్ అంటే మహారాణిలా నిల్చోవాలా అంటూ యాక్టింగ్ చేసి మరి తనలోని మరో యాంగిల్ చూపించింది యష్మి. మొత్తానికైతే హౌస్ లో ఉన్నంతసేపు యష్మి గౌడ ఓవర్ యాక్టింగ్ చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కిచెన్ లో జరిగిన అవమానం తలుచుకుని విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. ఆకలి అని అడగడానికి వెళ్తే ముష్టి వేసినట్టు వేసింది ప్రేరణ అంటూ ఆ బాధలో మరింత ఎమోషనల్ అయింది విష్ణు. ఆ సమయంలో చాలామంది హౌస్ మేట్స్ ఈమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు. మణికంఠ కూడా ముష్టి వేసినట్టు వేసిందంటూ అక్కడ విల్లింగ్ నెస్ కోల్పోయారంటూ చెప్పుకొస్తాడు. దీంతో కోపం తెచ్చుకున్న ప్రేరణ నేనేమైనా ముష్టి వేశానా, విసిరేసానా అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది. దీంతో విష్ణు ప్రియ ఎమోషనల్ అవుతూ ఎవరిదైనా ఆకలే కదా.. ఆకలి అన్నప్పుడు తను వేసి ఇచ్చిన విధానం నాకు నచ్చలేదు.. అది మరింత బాధ కలిగించింది అంటూ ఆమె ఏడ్వడమే కాదు అందరినీ ఏడిపించింది… మొత్తానికి విష్ణు ప్రియని చూసిన వారందరూ కూడా ఎమోషనల్ అయిపోయారు.