Thursday, October 3, 2024

Bigg Boss 8 : ఆమె ఏ అబ్బాయిని ఎలా పట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు.. సోనియా బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -


Bigg Boss 8 : బిగ్ బాస్ హౌస్‌లో సోనియా ఆకుల యవ్వారం వివాదాస్పదంగా మారింది. చిన్నోడు, పెద్దోడు అంటూ హద్దు మీరుతున్నట్లు అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు.. అయితే సోనియా ఆకుల ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నారు. మన నాగార్జున ఇచ్చిన హిట్స్ ప్రకారం.. అతని పేరు యశ్ వీర్ అని.. పదే పదే వైఎస్ వైఎస్ అని తెగ కలవరిస్తున్నారు నాగార్జున. తన ప్రేమకథ గురించి ప్రేరణకు హౌసులో చెప్పింది.. కానీ మరి పెళ్లికి ఎందుకు ఆలస్యం అని అడిగితే ఆ సీక్రెట్ చెవిలో చెప్పింది. అయితే నెటిజన్లు మాత్రం సీక్రెట్‌ను ఛేదించి కొన్ని వివరాలను పట్టుకున్నారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. సోనియా ప్రేమించిన వ్యక్తి.. పెళ్లి చేసుకోబోయే వాడికి ఇప్పటికే పెళ్లైందని.. పిల్లలు కూడా ఉన్నారని.. తాను ఎన్నారై అని తెలుస్తోంది. తన వ్యాపార కార్యక్రమాలను చూసుకునే బాధ్యతను సోనియాకు అప్పగిస్తే.. ఆమె అతడి కార్యక్రమాలను చూసుకుంటూ చివరికి అతడిని ప్రేమలో పడేసిందని .. చివరికి అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆమె ఎఫైర్‌లో అసలు వాస్తవాలు ఏంటనేది తెలియాల్సి ఉండగా.. డిసెంబర్‌లో సోనియా పెళ్లి అంటూ ట్విస్ట్ ఇచ్చారు ఆమె పేరెంట్స్.

సోనియాకు ఇప్పటికే పెళ్లి ఫిక్స్ అయిందని.. ఈ డిసెంబర్ లోనే తన పెళ్లి ఉంటుందని.. కాబోయే అత్తమామల అంగీకారంతోనే బిగ్ బాస్ హౌసులోకి అడుగుపెట్టిందిని సోనియా తల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరి ఇంట్లో అటు చిన్నోడు.. ఇటు పెద్దోడుతో ముద్దులు.. కౌగిలింతలు.. చేతిలో చేయి వేసుకోడాలు.. ఎక్కడెక్కడో పట్టుకోవడాలు ఇవన్నీ ఏంటంటే.. ‘మా అమ్మాయిని కావాలనే బ్యాడ్ చేస్తున్నారు.. చిన్నోడు పెద్దోడు అని చెప్పింది కదా నా కూతురు. చిన్నోడు అంటే చిన్న అన్నయ్య.. పెద్దోడు అంటే పెద్ద అన్నయ్య సింపుల్‌గా తేల్చిపారేసింది సోనియా తల్లి. కానీ మొదట్లో సోనియా చిన్న అన్నయ్య.. పెద్ద అన్నయ్య అని అన్నా.. రీసెంట్‌గా యష్మీ ఇచ్చిన స్ట్రోక్‌తో ‘అబ్బే.. నేనెప్పుడు చెప్పాను.. చిన్నన్న పెద్దన్న అని’ అంటూ ప్లేట్ పిరాయించింది. ఇక సోనియా వ్యవహారం ఇలా ఉంటే.. అక్కడ నిఖిల్ మాత్రం.. సోనియాకి కట్టు బానిసగా మారిపోయాడు. ఆమె సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనేంతలా మారిపోయాడు. సోనియానే సర్వస్వం అన్నట్టుగా మైకంలో మునిగిపోయాడు.

అయితే సోనియా-నిఖిల్ అర్థరాత్రి ముచ్చట్లు మితిమీరిపోవడంతో వారి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్‌లో మరొకరితో పెళ్లి పెట్టుకుని.. బిగ్ బాస్ హౌస్‌లో సోనియా చేస్తున్న ఈ పత్తేపారం ఏంటని ట్రోలింగ్ షురూ అయింది. ఇలాంటివి కామన్ బాసూ.. సోనియా ఏంటో నాకు తెలుసు.. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సోనియా అలాగే ఉంటుంది.. అలాగే మాట్లాడుతుందని ఎవరూ ఊహించనటువంటి ట్విస్ట్ ఇచ్చాడు సోనియాకి కాబోయే భర్త యష్ వీర్. ఇంతకీ ఈ మాట ఎవరి దగ్గర అన్నాడంటే.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన అభయ్ దగ్గర. అభయ్ నవీన్, సోనియా ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సోనియా ప్రియుడిని అభయ్ నవీన్ కలిశాడు. ఈ నేపథ్యంలో సోనియా-నిఖిల్ ఎఫైర్‌పై వస్తున్న ట్రోలింగ్‌పై అభయ్ నవీన్ ఎలా స్పందించాడో చెప్పాడు. సోనియా నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నాకు తెలిసి సోనియా.. అబ్బాయిని ఒకలా, అమ్మాయిని మరొకలా చూడరు. అందరితోనూ అలాగే ఉంటుంది. కాకపోతే, ఆమె ఆ వ్యక్తిని ఇష్టపడాలి. ఇంట్లోకి వెళ్లకముందే.. హౌస్‌లో ఉన్నప్పుడు నాకు తెలిసిన సోనియా వేరు. బయటకు వచ్చాక.. సోనియాపై వస్తున్న ట్రోల్స్, నెగిటివిటీ చూసి షాక్ అయ్యాను. నిఖిల్‌తో ఆమె రిలేషన్ బాగా నెగిటివ్ అవుతుందే అని చాలా ఫీల్ అయ్యాను అన్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!