Bigg Boss 8 : తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో రాను రాను మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తూ ఆ షోపై ఎక్కువ ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున రావడం, కంటెస్టెంట్స్ తో మాట్లాడటం, తప్పులు చెప్పటం, వాటిని మార్చుకోమని చెప్పడం…ఇవన్నీ మామూలే. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్స్‌లో అతను వేసుకునే షర్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఆ షర్ట్స్ అన్నీ చూడటానికి సింపుల్ గా ఉన్నాయి కానీ వాటి ధర ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవల ప్రసారమైన ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున బ్లూ షర్ట్‌లో కనిపించారు. చూడ్డానికి సింపుల్ గా ఉన్నా.. ధర ఎంతో తెలిసి మాత్రం ప్రేక్షకులు షాక్ అవుతారు. నాగార్జున నీలిరంగు చొక్కా బాగుంది, మనకి కూడా ఇలాంటి చొక్కా కావాలి అని నెటిజన్లు భావించి.. దాని ధర కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ బ్లూ షర్ట్ ధర 1,842 డాలర్లు అని గూగుల్ వెల్లడించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం ఈ షర్ట్ ధర రూ.1,54,209. ఈ ధర చూసిన తర్వాత, ఆ షర్ట్ చూడటానికి సింపుల్‌గా ఉందని, దీని ధర లక్షన్నర అనగానే ప్రేక్షకులు వామ్మో అంటున్నారు. అందుకే నాగార్జున స్టైలింగ్ చూసి ఇన్ స్పైర్ అయ్యి కూడా ఇలాంటి బ్రాండ్స్ వేసుకోవడం మన వల్ల కాదని మిడిల్ క్లాస్ అబ్బాయిలు అనుకుంటున్నారు.
ఇటీవల ప్రసారమైన ఆదివారం ఎపిసోడ్‌లోనే కాదు.. ప్రతి ఎపిసోడ్‌లోనూ నాగార్జున డ్రెస్‌లు సింపుల్‌గా ఉన్నా వాటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. ధరతో సంబంధం లేకుండా, చాలా మంది స్టైలింగ్ ప్రియులకు నాగ్ స్ఫూర్తి. ఇప్పుడే కాదు.. గత సీజన్లలో కూడా నాగార్జున స్టైలింగ్‌కు అభిమానులు ఉన్నారు. కానీ బిగ్ బాస్ ప్రేక్షకులు అతని హోస్టింగ్ గురించి మిశ్రమ సమీక్షలను ఇస్తారు. హౌస్‌మేట్స్ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని వివాదాలు సృష్టించినా నాగార్జున వాటి గురించి మాట్లాడడం లేదని చాలా మంది బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై నాలుగు వారాలైంది. అయితే వీకెండ్ ఎపిసోడ్ మాత్రం తాము బాగా ఎంజాయ్ చేసిందని వీక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిఖిల్, పృథ్వీ, సోనియాల మధ్య రిలేషన్ ఎలా డెవలప్ అవుతుందో ఈ సీజన్ ప్రారంభం నుంచి ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. దీనిపై చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే దీనిపై నాగార్జున ఎందుకు స్పందించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ వీకెండ్ ఎపిసోడ్ లో వీరి ఎఫైర్ పై నాగ్ స్పందన కరెక్ట్ అని ప్రేక్షకులు భావించారు.