Bigg Boss 8: జాతీయ స్థాయిలో పలు భాషల్లో రన్ అవుతున్నప్పటికీ తెలుగులోనే అత్యధిక రేటింగ్‌తో నంబర్ వన్ షోగా బిగ్ బాస్ దూసుకుపోతుంది. దీంతో నిర్వాహకులు రెట్టించిన ఉత్సాహంతో పలు సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కొత్త ట్విస్ట్ లతో చాలా కొత్తగా రన్ అవుతోంది. ఇందులో బ్యూటీఫుల్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సోనియా ఆకుల 4వ వారంలోనే ఎలిమినేట్ అయింది. ఈ సీజన్‌లో ఆమె షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుని బయటకు వెళ్లిపోయింది. తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా భారీ రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రసారం అవుతున్న ఎనిమిదో సీజన్ కూడా అలాగే కొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువ రేటింగ్ వస్తోంది. దీంతో మరిన్ని సర్ ప్రైజ్ లు, షాక్ లను ప్లాన్ చేస్తూ ఈ సీజన్ ను మరింత ఉత్కంఠభరితంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా 14 మంది సెలబ్రిటీలు హౌసులోకి ఎంటర్ అయ్యారు. వీరంతా తమ తమ రంగాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే హైలెట్ అయ్యారు. వారిలో సోనియా ఆకుల ఒకరు. రామ్‌గోపాల్ వర్మ హైలైట్ చేసిన ఈ బ్యూటీ మొదటి రోజు నుంచే తన సత్తా చూపింది. సోనియా ఆకుల బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చినప్పటి నుండి తన మార్క్ చూపించడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా షోలో తనదైన రీతిలో కామెంట్స్ చేస్తూ, గేమ్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ క్రమంగా ఇతరులపై వ్యక్తిగత దాడులు చేస్తూ, లవ్ ట్రాక్‌లు నడపడంతో ఆమె విమర్శలకు గురైంది. దీంతో ఎన్నో గొడవలకు దారి తీసింది.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో బెజవాడ బేబక్క మొదటి వారం, శేఖర్ బాషా రెండో వారం, అభయ్ మూడో వారం ఎలిమినేట్ అయ్యారు. అయితే నాలుగో వారంలో ఎవరు వెళ్తారనే దానిపై చాలా చర్చలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో 4వ వారం ఎలిమినేషన్ సంచలనం సృష్టించింది. ఇందులో సోనియా ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. మంచి అంచనాలతో బిగ్ బాస్ హౌస్ లోకి వస్తూ.. ఓ రేంజ్ లో విమర్శలు ఎదుర్కొన్న సోనియా నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సోనియాకు వారానికి రెండు లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం సోనియా ఆకుల రోజుకు రూ. 28 వేలు చొప్పున వారానికి రెండు లక్షలు మొత్తంగా నాలుగు వారాలకు 8లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆమెను బిగ్ బాస్ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.