Friday, October 4, 2024

Bigg Boss 8 : బిగ్ బాస్ కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత.. ఆమె క్లాన్ సభ్యులు ఎవరంటే ?

- Advertisement -


BIGG BOSS8 : నాలుగవ వారం నామినేషన్లతో సోమవారం నాటి ఎపిసోడ్ హాట్ హాట్ గా ప్రారంభమైంది. నబీల్, యష్మీలు సోనియాకు ఓ రేంజ్ లో చుక్కలు చూపెట్టారు. అటు చిన్నోడిని.. ఇటు పెద్దోడిని పెట్టుకుని ఆమె ఆడుతున్న కన్నింగ్, గ్రూప్ గేమ్ బట్టబయలు చేసి ఇచ్చిపడేశారు. అయితే హౌసులో ఒక్క ఆదిత్య ఓం తప్పితే.. మిగిలిన వాళ్లంతా నోటికి పని చెప్పేవాళ్లే. ఇక ఆయనను నామినేట్ చేస్తే.. గొడవ ఉందని అనుకున్నారో ఏమో కానీ సేఫ్ గా ఆదిత్యకు నామినేషన్లు గుద్దిపడేశారు హౌస్ మేట్స్ అంతా.B

పాపం ఆదిత్య ఓం మాత్రం తనని దూషిస్తున్నా… నువ్వు ఈ హౌసులో ఉండే ఆర్హత లేదు వెళ్లిపో అని సోనియా చులకన చేసిన.. అతను జనం చూసుకుంటారులే అని అలాగే మౌనంగా ఉండిపోయారు. ఇక నైనిక నామినేషన్లలో ఉన్నప్పటికీ..చీఫ్ గా తన స్పెషల్ పవన్ తో నైనికను సేవ్ చేశాడు నిఖిల్. రెడ్ ఎగ్ ఇచ్చావ్.. మరి నన్నెందుకు సేవ్ చేయలేదురా అని సోనియా చుక్కలు చూపించడం ఖాయంగానే కనిపిస్తుంది. మరి ఈ వారం నిఖిల్ ను ఏ విధంగా టార్చర్ చేస్తుంది చూడాల్సి ఉండగా.. మొత్తంగా నాలుగో వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో మణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, నబీల్, సోనియా, పృథ్వీ ఈ ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. ఈ ఆరుగురిలో సోనియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. హౌస్ మొత్తం ఆదిత్య ఓంకి గుద్దుపడేసినా.. హౌస్‌లో వాళ్లు టార్గెట్ చేసినా.. ఆడియెన్స్ అండగా నిలబడుతుంటారు. ఆ లెక్కన చూస్తే ఈ వారం సోనియా బయటకు వెళ్లడం ఖాయంగా అనిపిస్తుంది.

ఇకపోతే.. ఈ వారం చీఫ్ అండ్ రేషన్ టాస్క్‌లలో భాగంగా ఇంటికి కొత్త చీఫ్ చేరినట్లు తెలుస్తోంది. లైవ్ అప్ డేట్స్ చూస్తుంటే.. కిర్రాక్ సీత ఇంటికి కొత్త చీఫ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇంటిని రెండు టీంలుగా విడిపోయింది. నిఖిల్ వర్సెస్ సీత జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. సీత (క్లాన్)లో, ప్రేరణ, నబీల్, ఆదిత్య ఓం, విష్ణు ప్రియ, నైనికా ఉన్నారు. నిఖిల్ (క్లాన్)లో సోనియా, పృథ్వీ, మణికంఠ, యష్మీ గౌడ ఉన్నారు.

ఈ రెండు టీమ్‌లను చూస్తుంటే, యష్మీని అసహ్యించుకుని ప్రతి వారం ఆమెను నామినేట్ చేస్తానని ప్రమాణం చేసిన మణికంఠ ఆమె టీమ్‌లోనే ఉన్నాడు. మరోవైపు ఈ వారం నామినేషన్స్‌లో మణికంఠతో పాటు సోనియాను నామినేట్ చేయడం ద్వారా యష్మీ గౌడ తన గ్రూప్ గేమ్‌ను బయటపెట్టింది. అయితే యష్మీ నామినేట్ చేసిన మణికంఠ, సోనియా టీమ్‌లో యష్మీ గౌడ ఉన్నారు. వీరిద్దరు కలిసి ఎలా ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కిర్రాక్ సీతగా మారి చీఫ్ అయిపోయింది. తన టీంను ఎలా లీడ్ చేస్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!