Thursday, October 3, 2024

Bigg Boss 8 : ప్రేమలో మునిగి తేలుతున్న పృథ్వీ, విష్ణు.. ఇరగదీసిన నబీల్.. మణికంఠదే గోల్డెన్ బ్యాండ్

- Advertisement -


నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో ఫన్నీ టాస్క్‌లు జరిగాయి. ముందుగా ఆహారాన్ని నిల్వ చేసుకునే అవకాశం కోసం హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఇచ్చే శబ్దాలను ఓ ప్యాడ్ పై రాయమని చెప్పాడు. ఎవరైతే మరిన్ని సరిగ్గా వ్రాస్తారో వారు సూపర్ మార్కెట్‌లో ఎక్కువ సమయం షాపింగ్ చేసే అవకాశాన్ని పొందుతారు. ఇందులో నిఖిల్ టీమ్ ఎక్కువ స్కోర్ చేసింది. దీంతో సీత టీమ్‎కు లేకుండా నిఖిల్ నాన్ వెజ్ మొత్తం తీసుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ నిలబెట్టి వారి ముందు గోల్డెన్ బ్యాండ్ పెట్టాడు. దాన్ని ఉపయోగించుకుని తన క్లాన్ నుంచి మరో క్లాన్ కు వెళ్లవచ్చని తెలిపారు. కావాల్సిన వారు వెంటనే వెళ్లి తీసుకోండి అంటూ బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. నిఖిల్, సీత తమ టీమ్ సభ్యులను అభ్యర్థించారు. ముఖ్యంగా సోనియాకు నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నా రైట్ హ్యాండ్.. నా పవర్.. గుండెకాయ.. అటు సైడ్ వెళ్లొద్దు అంటూ వేడుకున్నాడు. కావాలంటే నువ్వు వెళ్లిపోవచ్చు అని మణికంఠను అనడంతో గోల్డెన్ బ్యాండ్ తీసుకుని ఆదిత్య ఓం మార్చుకుని సీత క్లాన్ లోకి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ బీబీ అడ్డా అనే ఎంటర్ టైనింగ్ టాస్క్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తోటి సభ్యులను అనుకరిస్తూ అందరినీ నవ్వించాలని అన్నారు. దీంతో అందరూ తమకు నచ్చిన కంటెస్టెంట్ బొమ్మను ట్యాగ్ వేసుకుని అనుకరించారు. ముఖ్యంగా సోనియా, పృథ్వీ, నిఖిల్.. ముగ్గురిని ఎక్కువగా ఇమిటేట్ చేశారు.ఈ కామెడీలో మణికంఠ విగ్గు గురించి ప్రేరణ పిచ్చ కామెడీ చేసింది. ఇది చూసి మణి నవ్వుతున్నాడు, కానీ లోపల మాత్రం కొంచెం బాధపడ్డాడు. ఈ టాస్క్‌లో నబీల్ అద్భుతంగా రాణించాడు. ఆదిత్య ఓంను అచ్చుదించాడు. కిచెన్ క్లీనింగ్ నుంచి నామినేషన్ల వరకు ఆదిత్య పూర్తిగా దించేశాడు. అలాగే హౌస్‌లో సోనియా, పృథ్వీ, నిఖిల్‌లను ఎక్కువగా ఇమిటేట్ చేయడంతో సోనియా హర్ట్ అయింది. ముగ్గురినే ఇమిటేట్ చూశావా.. ఎంతా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మనల్ని అని సోనియా చెప్పడంతో ఎంత ఫన్నీగా చేసినా మనకు లోపల కాస్త గుచ్చుకుంటుంది అంటూ మణికంఠ ఓ డైలాగ్ వేశాడు. అలాగే ఇంట్లో మరో లవ్ ట్రాక్ మొదలైంది. నిన్నటి టాస్క్‌లో విష్ణు కోసం పృథ్వీ లవ్ సాంగ్ పాడినప్పుడు విష్ణు ఉబ్బితబ్బిప్పైపోయింది. దీంతో వారిద్దరి ప్రేమను గ్రహించిన సోనియా.. పృథ్వీగాడిని చూసి భయమేస్తోంది.. ఆమెకు పడిపోతున్నాడు.. నాకు ఏది నిజం ? ఏది అబద్ధమో తెలియడమే లేదు.. అలా అనిపిస్తుంది అంటూ నిఖిల్ తో చెప్పుకొచ్చింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!