Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అవుతుందనే వార్తలు గతంలోనే వచ్చాయి. దీంతో నిఖిల్, పృథ్వీలపై తప్పా గేమ్ మీద దృష్టి పెట్టని సోనియా.. హౌసులో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే ఫీలింగ్ కు వచ్చారు ప్రేక్షకులు. కానీ నిన్ని ఎపిసోడ్ ప్రసారం అయిన తర్వాత, అసలు సోనియా వెనుక పెద్ద ట్విస్ట్ ఉంది. శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా కలిసి మణికంఠను జీరో అని స్టాంప్ వేయడం వల్ల తాను డైరెక్టుగా డేంజర్ జోన్ కు వెళ్లిపోయాడు. ఫైనల్ గా సోనియా మణికంఠ డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడు వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కంటెస్టెంట్లను అడిగారు హోస్ట్ నాగార్జున.
యాక్షన్ ఏరియాలో మణికంఠ, సోనియా ఉన్నప్పుడు వారిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలనే దానిపై నాగార్జున కంటెస్టెంట్ల నిర్ణయాన్ని అడిగారు. ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ చేస్తారో వారు హౌస్‌లో ఉంటారు . మిగిలిన వారు ఎలిమినేట్ అవుతారు. మణికంఠకు మరింత మద్దతు లభించడంతో ఇంట్లోనే ఉండిపోయాడు. అయితే బిగ్ బాస్ చెప్పే వరకు తాను జైలులోనే ఉండాల్సి ఉంటుందని నాగార్జున అంటున్నారు. సోనియాను ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఎలిమినేట్ అయిన తర్వాత సోనియా ఎలిమినేషన్‌కు సిద్ధమై బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చేసింది. అంతే కాకుండా నిఖిల్, పృథ్వీ తన మాట అసలు వినరని, ఇంట్లో అమ్మాయిలు మాత్రమే అలా అనవసరంగా ఆలోచిస్తారని చెప్పింది.
చివరకు హౌస్‌మేట్స్‌కు కూడా సోనియా అదే చెప్పింది. ఇంట్లో ఉన్న ఆడపిల్లలంతా ఒకవైపు అయిపోయారని, తన వెనుక మాట్లాడుకుంటూ ఉండేవారని, అందుకే తనకు ఒంటరి అనే ఫీలింగ్ వచ్చిందని అందరిపై ఆరోపణలు గుప్పించింది. యష్మీ తప్పా అమ్మాయిలు అందరూ ఒకరి మాటల వల్ల ప్రభావితులవుతున్నారని సోనియా చెప్పారు. అమ్మాయిలందరూ నిఖిల్, పృథ్వీల నుంచి అటెన్షన్‌ని కోరుకుంటున్నారని, అయితే వారిద్దరూ తన వెంటే ఉండడంతో వారికి కుళ్లు అని స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. దీంతో అందరూ హర్ట్ అయినట్లు అనిపించినా ఎవరూ ఏం మాట్లాడలేదు. సోనియా ఏం చెప్తున్నా కూడా అందరూ మౌనంగానే ఉండిపోయారు.
సోనియా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించగానే.. పృథ్వీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ వేదికపై తనను చూసిన తర్వాత, అతను ఏడవకుండా ధైర్యంగా ఉన్నాడు. సోనియా వెళ్లిపోతే నిఖిల్ ఒక్కడే చాలా ఏడ్చాడు. మహాథాలీలో నిఖిల్‌ను అన్నంతో పోలుస్తూ తను లేకపోతే హౌస్ అంతా వేస్ట్ అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చింది సోనియా అలాగే.. పృథ్వీని పాయసంతో పోల్చింది. సీత, విష్ణుప్రియ గురించి కూడా అంత పాజిటివ్‌గా ఏం మాట్లాడలేదు. దీంతో సోనియా వెళ్లే ముందు కూడా అలాగే ఉంది అని, తన బుద్ధి ఎప్పటికీ మారదని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎపిసోడ్ చివర్లో మరొక ట్విస్ట్ కూడా ఇచ్చారు నాగార్జున. ఈవారం మధ్యలో కూడా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని ప్రకటించారు.