Bigg Boss 8 : టాలీవుడ్ నుంచి దర్శకుడిగా పరిచయమై దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాంగోపాల్ వర్మ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో పెట్టుకున్న సరిహద్దులను తన సినిమాలతో చెరిపేశారు ఆయన.. బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో అడుగుపెట్టారు. దీంతో లెజెండరీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడిగా పూర్తిగా తన స్టైల్ మార్చుకుని విచిత్రమైన సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోను కూడా చూస్తుంటాడు. ఇప్పుడు ఆయన ఎనిమిదో సీజన్లో ఓ కంటెస్టెంట్‌కి సపోర్టు ఇస్తున్నారు.
గతంలో బిగ్ బాస్ షోపై రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ అంటే ఏమిటి? ఇది షోనా ఇంకేదైనానా ? హిందీలో అప్పుడెప్పుడో ఎవరో అంటే విన్నాను. ఇది తెలుగులో కూడా మొదలు అయిందా ? అసలు దాని గురించి నాకు కొంచెం కూడా తెలీదు. నేనెప్పుడు చూడలేదు కూడా అని చెప్పుకొచ్చారు. అసలు బిగ్ బాస్ షో అంటేనే తెలీదు అని చెప్పిన ఆర్జీవీ.. నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్న అరియానా గ్లోరీకి మద్దతుగా ఓ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ గా వచ్చిన శ్రీ రాపాకకు సోషల్ మీడియా ద్వారా కూడా సపోర్ట్ చేశాడు. అప్పటి నుంచి రాంగోపాల్ వర్మ కూడా చాలా సార్లు షో చూస్తున్నానని చెప్పారు.
బిగ్ బాస్ షో అంటే తెలియదు అన్న రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య కాలంలో ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక కంటెస్టెంట్‌కు మద్దతు తెలుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంటరైన తెలుగు అమ్మాయి సోనియా ఆకులకు వర్మ సపోర్ట్ చేస్తున్నాడు. ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే అతడు ఓ వీడియోను పంపారు. 14 మంది సెలబ్రిటీలు ఎనిమిదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో తెలుగు అమ్మాయి సోనియా మొదటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్టుగానే ఇంట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ ముందుకు సాగుతోంది. అయితే, ఆమె తన చెత్త ప్రవర్తనతో తరచూ విమర్శలను ఎదుర్కొంటుంది. కాబట్టి ఇప్పుడు నాలుగో వారంలో తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ ప్రమాదంలో పడింది.
ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన సోనియా ఆకుల.. ఎప్పుడూ పృథ్వీరాజ్, నిఖిల్ పక్కనే ఉంటుంది. దీంతో ఆమెకు చెడ్డ పేరు రావడంతో పాటు ఈ వారం జరిగిన ఎన్నికల్లో ఆమె చాలా వెనుకబడిపోయింది. దీంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగారు. ఈ మేరకు బిగ్ బాస్ లో ఆమెకు కేటాయించిన నెంబర్ తో పాటు ఆమె ఫోటోను షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నాడు. రాంగోపాల్ వర్మ తన X (ట్విట్టర్) ఖాతాలో ‘సోనియా ఆకుల బలం, యాటిట్యూడ్‌కు నిదర్శనం. బిగ్ బాస్‌లో బాగా ఆడుతుంది. ప్రతి రోజు ఒకసారి మిస్డ్ కాల్ ద్వారా, ఒకసారి హాట్‌స్టార్ ద్వారా ఓటు వేసి సోనియాకు మీ ప్రేమను పంచండి’ అని పోస్ట్ చేశాడు. అలాగే తొలిసారి ఆమెతో దిగిన ఫోటోను షేర్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు.