Thursday, October 3, 2024

Bigg Boss 8 : దుమ్మురేపుతోన్న వరంగల్ బిడ్డ.. నబీల్ రెమ్యూనరేషన్ తెలిస్తే ఖంగుతినాల్సిందే

- Advertisement -


Bigg Boss 8 : బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. గత సీజన్‌లో లేని విధంగా సీజన్‌ 8కు భారీ స్పందన వస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 అత్యధిక టీఆర్పీ రేటింగ్‎తో దూసుకుపోతోంది. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ అనే ట్యాగ్ తో ప్రారంభమైన బిగ్ బాస్ ఎవరూ ఊహించని ట్విస్ట్ లు, సర్ ప్రైజ్ లు, షాక్ లను జనాలకు ఇస్తోంది. ఇప్పటికి మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగో వారం చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ అయిన నబీల్ అఫ్రిది దుమ్మురేపుతున్నాడు. ఇంత ఎంటర్ టైన్ చేస్తున్న అతడికి బిగ్ బాస్ ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నాడనే చర్చ నెట్లో జరుగుతుంది.

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో రకరకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, గ్రూపులు, రొమాన్స్, లవ్ స్టోరీలు ఇలా రకరకాల ఎమోషన్స్ బిగ్ బాస్ షోలో కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఏ షోలో ఎప్పుడూ జరగని, కనిపించని ట్విస్ట్‌లు ఈ సీజన్‌లో చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్ల కూడా నీయవ్వ తగ్గేదేలే అన్నట్లు ఫర్పామెన్స్ ఇస్తున్నారు. టాస్క్‌లలో కూడా ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 11 మంది కంటెస్టెంట్స్‌లో యూట్యూబర్ నబీల్ అఫ్రిది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తనదైన ఆటతీరుతో, మాటతీరుతో అందరినీ ఆకర్షిస్తున్నాడు.

వరంగల్‌కు చెందిన యూట్యూబర్ నబీల్ అఫ్రిది బిగ్ బాస్ షోలో 14వ కంటెస్టెంట్‌గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. 14వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైన శైలిలో టాస్క్‌లు ఆడుతూ బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో విభిన్నమైన కంటెంట్‌తో వీడియోలు రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అప్పట్లో ఆయన గురించి చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ కంటే ముందు నబీల్ గురించి ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు నబీల్ చాలా మందికి టైటిల్ ఫేవరెట్ గా మారిపోయాడు. చాలా మంది నబీల్‌కు ఓటు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నబీల్ పేరే వినిపిస్తుంది. 90 శాతం నబీల్ కప్ కొట్టేస్తాడని అభిమానులు జోరుగా కామెంట్లు చేస్తున్నారు.

ఓటింగ్‌లో విష్ణుప్రియ, నిఖిల్‌ల రికార్డులను నబీల్ బద్దలు కొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టాస్కుల్లో తన సత్తా చాటుతున్నాడు. నబీల్ చీఫ్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చింది. అయితే సోనియా వల్ల అది మిస్ అయిందని అభిమానులు అంటున్నారు. అమ్మాయిలకు దూరంగా ఉంటూ టైటిల్ విన్నర్ రేసులోకి వచ్చిన నబీల్ బిగ్ బాస్ కు రాకముందు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం నబీల్ 25 రోజుల్లోనే 6 లక్షలకు పైగా ఫాలోవర్లకు పెంచుకున్నాడు. నబీల్ పర్ఫామెన్స్ ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ ట్రోఫీని అందుకుంటాడని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి వారం నబీల్‌కి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ, ప్రస్తుతం ఊపందుకుంటున్న ఈ వార్త సంచలనం రేపుతోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!