Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం వారాంతం వచ్చేసింది. నిన్నటి నుంచి ఓటింగ్ లైన్లు కూడా బంద్ అయ్యాయి. ఇప్పటి వరకైతే 14మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అయితే గత సీజన్ లాగే ఈ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని తెలుస్తోంది. గత సీజన్ 7లో అర్జున్ అంబటి, నాయని పావని, భోలే షావలి, అశ్విని, పూజా మూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత టాస్క్‌లలో మిగతా కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీని ఇచ్చి గెలిపించాడు. ఈ సీజన్లో టాప్ 5లో నిలిచాడు. అదే సీజన్‌లో, అశ్విని తన అందంతో ప్రేక్షకులను అలరించింది. నాయని పావని ఉన్నది కేవలం వారం రోజులే అయినా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో మరో నలుగురు కంటెస్టెంట్స్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తీసుకొస్తున్నారు.
అయితే గత సీజన్‌లో మాదిరిగానే ఐదో వారంలో హౌస్‌లోకి పంపిస్తారా.. లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. వారికి ఒక్కోక్కరిని ఒక్కో వారం పంపుతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పేర్లు చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం పాత కంటెస్టెంట్లనే మరో సారి హౌస్‌లోకి పంపబోతున్నట్లు తెలుస్తోంది. వారితో పాటు కొత్త వారిని కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో నలుగురు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. మొదటి సీజన్ కంటెస్టెంట్ హరితేజ. మరోసారి ఆమె హౌస్‌లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. అలాగే మరో పాత సీజన్ కంటెస్టెంట్ రోహిణి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. టాస్క్‌లతో పాటు హౌస్‌లో కామెడీ కూడా బాగానే చేసింది. అలాగే సీజన్ 4 కంటెస్టెంట్ నూక అవినాష్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అవినాష్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపాలని బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయింది.
ఈ ముగ్గురే కాకుండా సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావనిని కూడా మరోసారి సీజన్ 8లోకి తీసుకొస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారం తర్వాత సీజన్ 7లో నయని పావని ఎలిమినేట్ అయింది. అయితే శోభాశెట్టిని కాపాడేందుకు నయని పావనిని బయటకు పంపించారని ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. అందుకే ఇప్పుడు మరోసారి నయనిని హౌస్ లోకి తీసుకొస్తున్నారు. వీరితో పాటు రీతూ చౌదరి, గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.