Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా రెండో వారాన్ని పూర్తి చేసుకుంది. రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్‌కు తెరపడి ఆర్జే శేఖర్ బాషా హౌస్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్‌గా భాషా ఎలిమినేషన్‌ను హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. మొదటి వారంలో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ భాషాలు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్‌లో 12 మంది కంటెస్టెంట్లు మిగిలారు. మూడవ వారం నామినేషన్లలో ఎవరు ఉంటారో చూద్దాం. మూడో వారం హౌస్ మెంబర్స్ శక్తి, కాంతారా టీంలుగా విడిపోతారని హోస్ట్ నాగార్జున తెలిపారు. శక్తి క్లాన్ కు నిఖిల్, కాంతారా క్లాన్ కు అభయ్ చీఫ్ లుగా ఉంటారు. ఏ క్లాన్ లో చేరాలో నిర్ణయించుకునే బాధ్యతను కంటెస్టెంట్లకే వదిలేశారు నాగార్జున. దీంతో నిఖిల్ టీంలో విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా, శేఖర్ భాషా, సీత, నైనిక చేరారు. ప్రేరణ, యష్మీ గౌడ, ఆదిత్య ఓం, నబీల్, నాగమణికంఠ అభయ్ క్లాన్ లోకి వెళ్లారు.
నామినేషన్స్‌లో ఒక్కొక్కరిని సేవ్ చేసి.. చివరికి శేఖర్ భాషా, ఆదిత్య ఓం మిగిలారు. హౌస్‌లో ఎవరు ఉండాలో, ఎవరు బయటకు వెళ్లాలో కంటెస్టెంట్స్ నిర్ణయిస్తారని నాగ్ చెప్పగా, ఆదిత్య ఓం హౌస్‌లో ఉండేందుకు మెజారిటీ ఓట్లు సాధించడంతో శేఖర్ భాషను ఎలిమినేట్ చేస్తున్నట్టు నాగ్ ప్రకటించాడు. సీత, విష్ణుప్రియ, ప్రేరణ రియల్ అని.. నాగమణికంఠ ఫేక్ అని శేఖర్ భాషా వెళుతూ వెళుతూ చెప్పారు. మూడో వారం ఓ రేంజ్ లో జరగనుందని అర్థమవుతోంది. కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేయాలనుకుంటున్న వ్యక్తిపై చెత్తను కుమ్మరించి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా నువ్వు గెలవాలన్న స్పిరిట్ నాకిష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావ్ అన్నది తనకు నచ్చలేదని సీత.. పృథ్వీను ఉద్దేశించి చెబుతుంది. నేనొక టీమ్ లో ఆడినప్పుడు.. అపోజిట్ టీమ్ ని ఎలాగైన ఓడించాలనే ఆడతానని పృథ్వీ తేల్చి చెబుతాడు.
యష్మీని నామినేట్ చేసిన మణికంఠ తన కారణాలను తెలిపాడు. గిన్నెలు ఎవరు కడుగుతారో, ఎవరు కడగడం లేదు.. ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ చెబుతాడు. అయితే మా టీమ్‌కి పవర్ వచ్చినప్పుడు మాకు ఆ అవసరం లేదని యష్మీ గౌడ చెబుతుంది. దీంతో చిరాకు పడిన మణికంఠ.. నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ వినండి లేడీ అంటూ ఫైర్ అవుతాడు. నువ్వు నా దగ్గరికొచ్చి డ్రామాలు చేస్తావ్ అంటూ యష్మీ గౌడ డైలాగ్ వదులుతుంది. నాకు పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే రైజ్ చేస్తానని మణికంఠ చెప్పగా.. నువ్వేంటీ బొక్క రైజ్ చేసేదని యష్మీ బూతులు మాట్లాడింది. వెంటనే రివర్స్‌లో మణికంఠను నామినేట్ చేసి రివేంజ్ తీర్చుకుంది.. ఈ హౌస్‌లో ఉన్నన్ని రోజులు నిన్ను నామినేషన్స్‌లో తీసుకుంటానని తేల్చి చెప్పింది యష్మీ. నా హార్ట్ బ్రోక్ చేశావ్.. ఫ్రెండ్ షిప్ పేరుతో నన్ను మోసం చేశావని మండిపడుతుంది. అది మోసం కాదని మణికంఠ ఏదో చెప్పడోతుండగా.. ఇది నా నామినేషన్ గురూ నిల్చో అంటుంది. అయితే చూస్తా గురూ అని మణికంఠ ధీటుగానే బదులిచ్చారు. అలాగే సాక్స్ టాస్క్ లో సంచాలక్ గా సరిగా వ్యవహరించలేదంటూ ప్రేరణను విష్ణు ప్రియ నామినేట్ చేసింది. అటు సోనియాను నైనిక నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, సోనియా , కిర్రాక్ సీత ఉన్నారు. సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్ హాట్ హాట్‌గానే జరిగే అవకాశం ఉంది.