Friday, October 4, 2024

Bigg Boss : 25 కేజీల గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..ఎన్ని లక్షలో తెలుసా?

- Advertisement -


Bigg Boss : రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇన్ని రోజులు మండపాల్లో పూజలు చేసిన గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఇక మంగళవారం హైదరాబాద్‌లో శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఇక నిమజ్జనానికి ముందు మండపాల వద్ద వినాయకుడి లడ్డూ వేలం పాటలు చాలా ముఖ్యమైనవి. గణపతి లడ్డూల కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోటీ పడుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించేందుకు కూడా సిద్ధమవుతుంటారు. తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, పాపులర్ యూట్యూబర్ టేస్టీ తేజ భారీ ధరకు వినాయకుడి లడ్డును దక్కించుకున్నాడు. తన స్వగ్రామం గుంటూరు సమీపంలోని తెనాలిలో జరిగిన గణేష్ నిమజ్జనంలో టేస్టీ తేజ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకా చాలా మందితో పోటీ పడుతూ దాదాపు 25 కిలోల గణపతి లడ్డూలు రూ. 75 వేలకు సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు. మా గ్రామంలో గత 25 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 25 ఏళ్లు కావడంతో గణేశుడికి 25 కిలోల భారీ లడ్డూను నైవేద్యంగా పెట్టారు. ఇప్పుడు వేలంలో ఈ లడ్డూ రూ. 75 వేలుకు దక్కించుకున్నా అని టేస్టీ తేజ తెలిపారు.

టేస్టీ తేజ వేలంలో వినాయకుడి లడ్డూను కొనుగోలు చేసి ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లాడు. ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి నృత్యం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన టేస్టీ తేజ జబర్దస్త్‌తో చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ గా తేజ్జీ తేజ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. తేజతో పాటు ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, హరితేజ బిగ్ బాస్ 8 హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!