Friday, October 4, 2024

Bigg Boss: నిజంగానే నిఖిల్ – కావ్య బ్రేకప్ చెప్పారా.. ఆ రూమర్స్ మాటేంటి ?

- Advertisement -



Bigg Boss: నిఖిల్ ఈ పేరుతో బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చిన తర్వాత ఆయన పాపులారిటీ మరింత పెరిగిపోయి అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ 2 వారాలు పూర్తి చేసుకుంది. దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు బిగ్‌బాస్‌లో మొదటి వారంలో ముగ్గురు చీఫ్‌లు ఎంపికైతే.. నిఖిల్ మలయక్కల్ మాత్రం నిజాయితీగా ఆడి బెస్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా సండే ఫండే సందర్భంగా సోనియాకు ఫేవర్ అన్నట్లు అనిపించిన నిఖిల్.. ఆ తర్వాత తన ఆటతో నాగార్జునని కూడా ఇంప్రెస్ చేశారు. చీఫ్ గా నిఖిల్ బెస్ట్ అని, ఇంటి నుంచి పాలించే అధికారం తనకే ఉందని, నైనికా, యష్మీ చీఫ్‌గా ఉండేందుకు అర్హులు కాదని కూడా ప్రకటించాడు.

తన క్లాన్ లో ఒక్కడే ఉన్నా .. ఆయన టీంకు రేషన్ లేకున్నా.. వేరే కంటెస్టెంట్స్ డీ మోటివేట్ చేస్తూన్నా తన గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఆయన గురించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఆయన లైఫ్ స్టైల్ గురించి , లవ్, బ్రేకప్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిఖిల్ అసలు పేరు నిఖిల్ మలయక్కల్. కర్ణాటకకు చెందిన వ్యక్తి. కన్నడ చిత్రాల్లో హీరోగా నటించిన తనకు అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో గోరింటాకు అనే సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్రవంతి, అమ్మకు తెలియని కోయిలమ్మ వంటి పలు సీరియల్స్‌లో నటుడిగా మంచి పేరు తెచ్చుకుని టీవీ షోలతో పాటు సీరియల్స్‌లో కూడా పాల్గొంటూ మంచి పాపులారిటీ సంపాదించారు.

నిఖిల్ తన మొదటి సీరియల్ గోరింటాకులో నటిస్తున్నప్పుడే కావ్యశ్రీని కలిశాడు. ఆమె కూడా కర్ణాటకకు చెందిన నటే. గోరింటాకు సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో పాటు అదే సమయంలో కావ్య – నిఖిల్ జంటకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఎంటర్‌టైన్‌మెంట్ షోలతో పాటు పలు షో డ్యాన్స్ షోలలో పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించి ఫోటోలు, రీళ్లు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై ఓ షోలో నిఖిల్ మాట్లాడుతూ, కావ్య చాలా మంచి అమ్మాయి అని, ఆమెను తన బెస్ట్ ఫ్రెండ్‌గా పొందడం తన అదృష్టమని చెప్పాడు. మరి పెళ్లి మాట ఏంటని అడిగితే… ఇప్పుడు అలాంటిదేమీ లేదని, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని కూడా అన్నారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మానేశారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఏదో భేదాభిప్రాయాలు వచ్చి మళ్లీ కలుసుకుంటారని అందరూ అనుకుంటే అదీ జరుగలేదు. నిఖిల్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పారు… కానీ కావ్య నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం నిఖిల్ సింగిల్ అని చెబుతూ ఆట మీద ఫోకస్ చేస్తున్నారు. మొత్తానికైతే నిఖిల్ – కావ్య బంధానికి బ్రేకులు పడ్డాయి అనే విధంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!