Bigg Boss8 Day11 Promo : బిగ్ బాస్ సీజన్ 8 పదకొండో రోజుకు చేరుకుంది. 11వ రోజు ఎపిసోడ్‌లో భాగంగా తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ మనీ పేరుతో కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూసేద్దాం. ఈ సీజన్‌లో ఇన్ఫినిటీ మనీని ప్రైజ్ మనీగా గెలుచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అందించారు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే మొదటి ఛాన్స్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ లేటెస్ట్ ప్రోమో ప్రారంభమైంది. ఇక అక్కడ టీవీలో స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాలి అంటూ మణికంఠ, సోనియా ఆకుల, విష్ణు ప్రియ పేర్లను బిగ్ బాస్ ప్రదర్శించారు. స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేందుకు ముగ్గురూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తుతుండగా, సోనియా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఇతర పోటీదారులు మణికంఠను ఆపడానికి ప్రయత్నించగా, విష్ణు ప్రియ మాత్రం సమయానుసారం పాటించి.. తొందరగా పరిగెత్తి స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తుంది. ఒక్కసారిగా సోనియా పడిపోవడంతో అందరూ ఆమెను లేపేందుకు ప్రయత్నించారు.
ఆ తర్వాత పృథ్వీ సోనియాను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఈ టాస్క్ పూర్తయిన వెంటనే నిఖిల్, యష్మీల మధ్య గొడవ మొదలైంది. నిఖిల్ మాట్లాడుతూ.. మణికంఠ ప్లేస్‌లో నేను ఉంటే రఫ్‌గా ఆడతాను.. కదా.. నీకు తగలొచ్చు నాకు దెబ్బలు తగలవచ్చు. మనం ఆర్టిస్టులము. తల పగిలితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ కాస్త నోరు గట్టిగా చేసుకుని మాట్లాడారు నిఖిల్. వెంటనే మండిపడిన యష్మీ.. సెంటిమెంట్‌గా మాట్లాడి.. మా ఆటను పక్కనబెట్టి మా బుర్రలను నీ వైపుకు కన్వర్ట్ చేస్తామని చెప్పింది. వెంటనే శేఖర్ బాషా కల్పించుకుని నిఖిల్ ను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లకు రెండో టాస్క్ ఇచ్చారు. రెండవ అవకాశం విలువ రూ.50,000. ప్లాస్మాలో పేర్లు చూపించిన సభ్యులు విడవకుండా తాడు పట్టుకుని తమ బంతులను బుట్టలో వేసుకోవాలని అన్నారు. అక్కడ పృథ్వీ, నవీన్, నిఖిల్ పేర్లను బిగ్ బాస్ చూపించారు. ఆట ప్రారంభం కాగానే ముగ్గురు పోటా పోటీగా ఆడారు. అయితే ఈ పోటీలో నబీల్ విఫలమయ్యాడు. నిఖిల్, పృథ్వీ మధ్య గొడవ జరిగింది. డబ్బు ఆశ చూపి కంటెస్టెంట్ల మధ్య గొడవలను మరింత పెంచేందుకు బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.