Bigg Boss: బిగ్ బాస్ ప్రతి బాషలోనూ భారీ టీఆర్పీతో దూసుకుపోతున్న రియాల్టీ షో. దాదాపు 100రోజుల పాటు కంటెస్టెంట్లను హౌసులో బంధించి వాళ్లతో టాస్కలు ఆడించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం ఈ షో ఉద్దేశం. ఈ షోకు కంటెస్టెంట్లతో పాటు హోస్టు కూడా ముఖ్యమే. వారు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ.. వారిని ఓ దారిలో పెట్టడానికి ఓ పెద్దమనిషిలా వ్యవహరిస్తారాయన. సాధారణంగా హోస్ట్‌కి ఎంత రెమ్యునరషన్ ఉంటుంది. చిన్న షోలకైతే లక్ష.. పెద్ద షోలకు రూ. 5 లక్షలు అనుకుందాం. అవి మామూలు షోలు అయితేనే. బిగ్ బాస్ లాంటి బిగ్ షోకు ఎంతుంటది అనుకుంటున్నారు. హా.. కోటి నుంచి మొదలుపెట్టినా ఒక రూ. 50 కోట్లు ఉంటుందని అనుకుంటున్నారు కదా… అంతెందుకు తెలుగు బిగ్ బాస్ కోసమే నాగార్జున.. దాదాపు రూ.70 కోట్లు అందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అలాంటి బిగ్ బాస్ సీజన్ కు ఒక హోస్ట్ అక్షరాలా.. ఏంటి.. అక్షరాలా రూ. 350 కోట్లు అందుకుంటున్నాడట. ఏంటి దిమ్మ తిరిగిపోతుంది కదూ.. ఆ హోస్ట్ ఎవరనుకుంటున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.
నిజానికి బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షోను మొదలు పెట్టిందే సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఆ షో అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు 18 వ సీజన్ లో అడుగుపెట్టబోతుంది. ఈ 18 సీజన్లకు మకుటం లేని మహారాజులా హౌస్ ను ఏలుతున్నాడు సల్లూ భాయ్. నిజం చెప్పాలంటే ఈ బిగ్ బాస్ రియాల్టీ షో.. సల్మాన్ ను పట్టి పీడిస్తుంది. చాలాసార్లు సల్లు భాయ్.. బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పాలని అనుకున్నా కూడా.. హోస్ట్ గా ఇంకెవరు చేయమని చెప్పడంతో బిగ్ బాస్ యాజమాన్యం .. సీజన్.. సీజన్ కు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ సల్మాన్ నే హోస్ట్ గా వ్యవహరించేలా చేస్తోంది. అలా ఇప్పటికి 17 సీజన్లను సల్లూ భాయ్ విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు సీజన్ 18 మొదలైంది. ఈసారి కూడా సల్మాన్ చేయను అంటూనే చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి సల్మాన్ రెమ్యూనరేషన్.. ఆకాశాన్ని తాకినట్లు తెలుస్తోంది. 14 వారాలకు గానూ సల్మాన్ రూ. 350 కోట్లు అందుకుంటున్నాడని బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ సల్మాన్ రికార్డ్ సృష్టించాడని అని చెప్పొచ్చు. ఈ రికార్డ్ ను బద్దలుకొట్టే మొనగాడు మళ్లీ వస్తాడన్న నమ్మకం కూడా ఎవరికి లేదు. ఏదిఏమైనా సల్మాన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.