Saturday, October 5, 2024

Bigg Boss : నిఖిల్ కు చీర, గాజులు ఒక్కటే తక్కువ.. పుసుక్కున విష్ణు ప్రియ ఇంత మాటనేసింది ఏంటి బాసూ !

- Advertisement -


Bigg Boss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరింత ఆసక్తికరంగా సాగుతోంది. రెండు మూడు వారాల్లో వైల్డ్ కార్డ్ ద్వారా 12 మంది హౌస్‌లోకి ప్రవేశిస్తారని బిగ్ బాస్ తెలిపారు. ఆ 12 మందిని ఆపడానికి.. హౌస్‌లో ఉన్నవారిని ఎలిమినేట్ చేయకుండా నిరోధించడానికి బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన బెలూన్ టాస్క్ లో సీత క్లాన్ విజయం సాధించింది. దాంతో నిఖిల్ క్లాన్ నుంచి ఒకరిని టాస్కుల్లో పాల్గొనకుండా తీసేయాలని.. అందుకు అతడి టీమ్ నిర్ణయించుకుని ఏకాభిప్రాయం చెప్పాలని కోరుతాడు బిగ్ బాస్. మణికంఠను వారు తొలగిస్తారు. తరువాత, సోనియా, నబీల్ ఇద్దరూ బిర్యానీ టాస్క్‌ను 45 నిమిషాల్లో పూర్తి చేయలేక విఫలమయ్యారు.

బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 26వ ఎపిసోడ్‌లో పట్టుకునే ఉండు లేకపోతే పగిలిపోతుంది టాస్కులో పృథ్వీ గెలిచాడు. ఓడిపోయిన సీత క్లాన్ నుంచి అనర్హులుగా భావించే వారిని తొలగించాలని, అది నిఖిల్ టీమ్ నిర్ణయిస్తుందని బిగ్ బాస్ చెప్పారు. నిఖిల్ క్లాన్ నిర్ణయించి నబీల్‌ను టాస్క్ నుండి తొలగించింది. నబీల్‌ను తొలగించడంతో సీత క్లాన్ తీవ్ర నిరాశకు గురైంది. నిఖిల్‌పై అందరూ కోపంగా ఉన్నారు. “నిన్నటి టాస్క్‌లో ఇది వైల్డ్ కార్డులను ఆపడానికి అని చెప్పి ఇవాళ నబీల్‌ను తీస్తారా. ఇలాంటి టూ ఫేస్‌డ్ మొహం ఉన్న వ్యక్తిని చూడలేదు” అనుకుంటూ వెళ్లిపోయింది విష్ణుప్రియ. దానికి నిఖిల్ “మీకు అలా అనిపిస్తుందా.. థ్యాంక్యూ” అన్నాడు.

కిర్రాక్ సీత అప్పుడు నువ్వు నబీల్‌ని ఎందుకు తీశావని అడుగుతుంది. “ఇక్కడ కాదు. పర్సనల్ గా చెప్పు” అంటూ పృథ్వీ చెబుతాడు. దీంతో నిఖిల్ సీతను పక్కకు తీసుకెళ్లి ఎక్స్‌ప్లెన్ చేస్తాడు. సీత అందుకు అంగీకరించదు. “నిన్న ఇది వైల్డ్ కార్డ్స్ వర్సెస్ మనమని చెప్పాం. అంతా కలిసి ఆడాలి. వైల్డ్ కార్డ్స్ రాకుండా చేయాలని, ఇప్పుడు నీ టీమ్‌ను ప్రొటెక్ట్ చేసుకుంటానంటావేంటీ” అని సీత వెళ్లిపోయింది. సీత తన క్లాన్ కు అదే విషయం చెబుతుంది. అంటే, ఇప్పుడు వాళ్ల దృష్టిలో నేను అనర్హుడినా అని నబీల్ ప్రశ్నిస్తాడు. “ఆయన గేమ్ ఆడుతున్నాడు. చీఫ్ పొజిషన్‌లో ఉండి ఛీప్‍గా బిహేవ్ చేస్తున్నాడు. చేతులు కట్టుకుని, రెడ్ బ్యాంగిల్స్, బొట్టు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ. అలా అని నేను ఆడవాళ్లను తక్కువ చేయట్లేదు” అని విష్ణుప్రియ కామెంట్లు చేసింది. “తను ఇద్దరు దగ్గరికే వెళ్లి వాళ్ల నిర్ణయం అడిగి వెళ్లి తీసుకుంటున్నాడు” అని నైనిక చెబుతుంది. “అలా అంటే డంబ్ అనేగా. తనకు నిర్ణయం తీసుకోరానప్పుడు ఎందుకు” అని ప్రేరణ అంది. ఇలా ప్రతి ఒక్కరు నిఖిల్‌పై అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!