Bigg Boss Telugu 8: అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 12వ రోజుకు చేరుకుంది. తాజాగా 12వ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసిన మేకర్స్.. ఇందులో బిగ్ బాస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా కంటెస్టెంట్లకు మరో టాస్క్ తో ఫన్ క్రియేట్ చేశారు. కాకపోతే ఈ ప్రోమోలో కొత్త టాస్క్ తో కంటెస్టెంట్ చేసిన సందడి అంతా ఇంతా కాదు అని చెప్పొచ్చు. అలా అందరి టాలెంట్ బయటపడింది.
ట్రూత్ ఆర్ డేర్ పేరుతో స్పిన్ ది బాటిల్ అనే టాస్క్‌ను బిగ్ బాస్ నిర్వహించారు. మీరందరూ గుండ్రంగా కూర్చుని, మీ అందరి మధ్యలో సీసాని తిప్పాలి. సీసా ఎవరి వైపు చూపితే ఆ సభ్యుడు ట్రూత్ ఆర్ డేర్‌లో ఆ సభ్యునికి నచ్చిన సవాలును మరొక సభ్యునికి ఇవ్వాలి. అంటూ శేఖర్ బాషా అక్కడే పుస్తకం చదివి కుటుంబ సభ్యులకు టాస్క్ ప్రకటించారు. తర్వాత ఒక్కొక్కరు ఒక్కో ఛాలెంజ్ ఇచ్చి బాటిల్ తిప్పుతూ తెగ సరదా ఎంజాయ్ చేశారు. అందులో భాగంగానే హీరో ఆదిత్య ఓం పెదవులకు విష్ణు ప్రియ లిప్ స్టిక్ వేసింది. ఆదిత్య అమ్మాయిలా నడుస్తూ ర్యాంప్ వాక్ చేశాడు. ఆ తర్వాత నైనికాకు ఓ అబ్బాయిని బలవంతంగా పట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలని శేఖర్ భాషా చెప్పడంతో.. నైనిక.. శేఖర్ ను బలవంతంగా పట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరి అతనితో పాటు ఆమె కూడా అందులో పడిపోయింది.
ఛాలెంజ్‌లో భాగంగా తర్వాత నిఖిల్‌కి కంటెస్టెంట్లు చీర కట్టించి అతనిలోని మరో కోణాన్ని బయటపెట్టారు. నిఖిల్ అమ్మాయిలా డ్యాన్స్ చేస్తూ హౌస్‌మేట్స్‌ని అలరించాడు. నాది నక్కిలీసు గొలుసు అనే పాటకు నిఖిల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి జనాలను ఆకట్టకున్నాడు. మొత్తానికి నిఖిల్ నటనకు అందరూ ఫిదా అయిపోయారని చెప్పొచ్చు. ఈ ప్రోమో చూసిన చాలా మంది నెటిజన్లు నిఖిల్ బ్రో నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌లో బెజవాడ బేబక్క మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం 13 మంది హౌస్‌మేట్స్ కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆరుగురు నామినేట్ కాగా కిర్రాక్ సీత, పృథ్వీ శెట్టి ఎలిమినేషన్ కు దగ్గరైనట్లు సమాచారం. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో