Tuesday, October 8, 2024

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లో రొమాన్స్ షురూ.. ఏమడిగినా ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్

- Advertisement -


Bigg Boss Telugu 8: ఎన్నో అనుమానాల మధ్య తెలుగులోకి పరిచయమైనా అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసు దోచుకున్న షో బిగ్ బాస్. ఎప్పుడూ చూడని కాన్సెప్ట్‌తో వచ్చినప్పటికీ, తెలుగు వారు దీనికి భారీ రెస్పాన్స్ ఇచ్చారు. ఫలితంగా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఏడు సీజన్లు కూడా చాలా విజయవంతమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మొదలైన ఎనిమిదో సీజన్ కూడా అదే రేంజ్ లో నడుస్తోంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో సోనియా, నిఖిల్ మధ్య ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం..

బిగ్ బాస్ ఏడో సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఎనిమిదో సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ అనే థీమ్ తో తీసుకొచ్చారు. ఇందులో ఎన్నో ట్విస్ట్‌లు, షాక్‌లు, ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయి. దీంతో షో ప్రారంభం నుంచే రంజుగా మారుతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకులు స్పందిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎనిమిదో సీజన్‌లో 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అందులో సోనియా ఆకుల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. రాంగోపాల్ వర్మ సినిమాలో కూడా నటించింది. ఈ క్రమంలో ఆమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఇందులో మొదటి నుంచి తన ప్రత్యేకతను చాటుకుంది.

సోనియా ఆకుల ఎనిమిదో సీజన్‌లో చాలా డేరింగ్ అండ్ డాషింగ్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఈ చిన్నది మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో అందంగా తయారవుతూ అదుర్స్ అనిపిస్తోంది. అయితే, ఎదుటి వాళ్లపై దూకుడుగా వెళ్తూ టార్గెట్ చేయడం సోనియాను విమర్శలపాలు చేస్తోంది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అందరి దృష్టి సోనియా పై పడింది. ఆమె అందానికి, మాటలకు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఎదుటి వాళ్లపై దూకుడుగా వెళ్తూ టార్గెట్ చేయడం సోనియాను విమర్శలపాలు చేస్తోంది. అయితే నిఖిల్‌తో చనువుగా ఉండాలని మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఈ మధ్యన ఇద్దరూ దగ్గరవుతూ హైలెట్ అవుతున్నారు.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో పెద్దగా లవ్ ట్రాక్స్ కనిపించడం లేదు. కానీ, సోనియా – నిఖిల్‌లు కాస్త క్లోజ్‌గా ఉన్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని స్టార్ మా చూపిస్తోంది. ఇదే విషయంలో విష్ణుప్రియను టార్గెట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. కానీ, సోనియా, నిఖిల్ చాలా స్పష్టంగా ఉన్నారు. దీంతో వీళ్ల ట్రాక్‌పై ఎన్నో వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ ఎపిసోడ్‌లో నిఖిల్‌తో సోనియా ఆకుల ‘నువ్వు స్మోకింగ్ మానేస్తే.. ఏం అడిగినా ఇస్తా’ అని చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడున్న వ్యక్తులు సరదా వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూద్దాం వీరి బంధం ఎక్కడికి వెళ్తుందో…ఎలా మారుతుందో!

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!