Bigg Boss : సినీ పరిశ్రమలోని ప్రముఖుల వ్యవహారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. వారి జీవితాల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి ప్రయాణం ఓ సముద్రం లాంటిది. అన్ని ఇన్ని కాదు ఎన్నో ప్రశ్నల నడుమ వారు పోటీ పడుతుంటారు. సక్సెస్ స్టోరీ ఉన్నట్లే కొన్ని చీకటి భాగోతాలు కూడా ఉన్నాయి. సెలెబ్రేటిల జీవితాల్లో జరిగే ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఓ హీరోయిన్ గురించి ఓ సినీ క్రిటిక్ సంచలన విషయాలను బయటపెట్టాడు. భారతదేశమంతటా అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అటువంటి ప్రముఖ క్రిటిక్స్ లలో ఉమైర్ సంధు ఒకరు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తూ తరచూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం..
టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా గురించి ఉమైర్ సంచలన విషయాలు వెల్లడించారు. తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దీంతో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. మన్నారా చోప్రా సినిమాల్లోకి రాకముందే మోడల్‌గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇది చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో 2014లో వచ్చిన ‘జిద్’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంది.
ఆ తర్వాత తమిళంలోకి వెళ్లి పలు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ‘జక్కన్న’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘తిక్క’, ‘రోగ్’, ‘సీత’, ‘హై ఫైవ్ – ఫన్ అండ్ గన్’, ‘తిరగబడరా సామీ’ వంటి చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కూడా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆ షోలో తన నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో గతేడాది ఈ చిన్నారి బిగ్ బాస్ 17వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. గేమ్‌తో ఆకట్టుకుని ఫైనల్‌కు చేరుకుంది.
బిగ్ బాస్ షోలో పాల్గొన్న మన్నారా చోప్రా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ గా తనకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని.. అయితే తనకు వరుస ఆఫర్లు రావడానికి కారణం బిగ్ బాస్ హోస్ట్ తో ఎఫైర్ అని ఉమైర్ సంధు చెప్పారు. సల్మాన్‌ఖాన్‌తో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ బాలీవుడ్లోనే కాకుండా యావత్ ఇండియాలో సంచలనంగా మారుతోంది. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఉమైర్ సంధు గతంలో కూడా చాలా మందిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.