Thursday, October 3, 2024

Bigg Boss 8 Promo : హౌస్ మేట్స్ ను చెత్తలో ముంచేసిన బిగ్ బాస్.. ఈ వారం చెత్త నామినేషన్

- Advertisement -

Bigg Boss 8 Promo : హౌస్ మేట్స్ ను చెత్తలో ముంచేసిన బిగ్ బాస్.. ఈ వారం చెత్త నామినేషన్
Bigg Boss 8 Promo : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారం గుడ్డు, ఫుడ్ కోసం యుద్ధంతోనే సరిపోయింది. అయితే బేబక్కను బయటకు పంపిన తర్వాత హౌస్ మేట్స్ రూట్ మార్చుకుని ఆటపై దృష్టి సారించారు. ఒకరిపై ఒకరు పర్సనల్ అటాక్ చేసుకుంటూ.. ఎందుకు చూస్తున్నామా అనుకునే ప్రేక్షకులకు కాస్త కంటెంట్ అందించగలిగారు. అయితే అన్ లిమిటెడ్ మనీ, అన్ లిమిటెడ్ ట్విస్టులు అంటూ చెప్పినట్లుగానే నాగార్జున రెండో వారంలో హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ క్లాస్ పీకారు. ఎప్పటిలాగే ఆదివారం ఎపిసోడ్ సరదాగా సాగింది. ఊహించని విధంగా శేఖర్ బాషాను హౌస్‌మేట్స్ అందరూ బయటకు పంపారు. ఇటీవల, తాజాగా బిగ్ బాస్ 15వ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది, ఇందులో హౌస్‌మేట్స్ మధ్య చెత్త నామినేషన్ ప్రక్రియ జరిగింది. బిగ్ బాస్ ప్రతి ఒక్కరికీ చెత్తబుట్టను అందించి, వారు నామినేట్ చేయాలనుకున్న హౌస్‌మేట్స్‌పై వేయమని చెప్పడం విశేషం.

బిగ్ బాస్ తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్ లో చెత్తను ఉపయోగించి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో హౌస్ మేట్స్ కారణం చెప్పవలసి ఉంటుంది. ముందుగా కిర్రాక్ సీత.. పృథ్వీ, యష్మీ గౌడల గురించి మాట్లాడింది. యాష్మీ గౌడ డామినేటింగ్‌గా మాట్లాడుతుందంటూ ఆమెను నామినేట్ చేసింది. అలాగే పృథ్వీ కూడా మరో కారణంతో చెత్త వేసి నామినేట్ చేసింది. అయితే తాజా ఎపిసోడ్ లో అందరి టార్గెట్ యష్మీ గౌడ అని అర్థం అవుతుంది. గత వారం ఈ యష్మీని చీఫ్ అయిన కారణంగా ఒక్కరికి కూడా నామినేట్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు బిగ్ బాస్. అంతేకాకుండా నాగార్జున చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ ఈ వీకెండ్ యష్మి గౌడ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో అందరూ ఆమెని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ప్రేరణ, విష్ణు ప్రియ మధ్య కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. చెత్తబుట్టలో నుంచి ఒక్క బాటిల్ తీసి పెడితేనే పెద్ద గొడవ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం నాపై చెత్త వేసి నామినేట్ చేయండి అంటూ తన అక్కసును వెళ్లగక్కింది ప్రేరణ. అంతే కాకుండా నువ్వు రెండు గుడ్లు ఎందుకు తిన్నావంటూ నిలదీసింది. బ్రెయిన్ లెస్ పీపుల్ అని విష్ణు అంటే.. యూస్ లెస్ పీపుల్ అని ప్రేరణ అంటుంది. మొత్తానికి విష్ణు, ప్రేరణ మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగిందని చెప్పుకోవచ్చు.

ఆ తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నాగ మణికంఠ, యష్మి గౌడ మధ్య కూడా హీట్ ఆర్గ్యూమెంట్ నడిచింది. ఇప్పటి దాకా హౌసులో ఏదో కోల్పోయి డల్ గా ఉన్నాడనుకున్న మణికంఠ నిన్నటి ఎపిసోడ్లో యష్మీపై తన విశ్వరూపం చూపించాడు. ఇక తనను నామినేట్ చేసిన మణికంఠను ఫేక్ అంటూ అతనికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు యష్మి గౌడ. ఇక నిన్నటి ఎపిసోడ్ ఆద్యంతం తామేం తక్కువ తిన్నామా అన్నట్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యి ఎదుటి వారిని నామినేట్ చేశారు. ఈ సారి నామినేషన్లో 11మంది కంటెస్టెంట్లు నిలిచారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!