Sunday, October 13, 2024

Bigg Boss 8: ఓటింగ్‌లో వాళ్లిద్దరే టాప్.. రెండో వారం కిర్రాక్ సీత ఎలిమినేట్?

- Advertisement -


Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారం నామినేషన్లు హాట్ హాట్ గానే సాగాయి. రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ నామినేషన్ల ప్రక్రియలో తొలిరోజు రెచ్చిపోయిన కంటెస్టెంట్లు రెండో రోజు పెద్దగా హంగామా లేకుండా ప్రశాంతంగా కనిపించారు. చాలా వరకు సిల్లీ కారణాలతోనే నామినేషన్లు వేశారు. అలాగే తమకు ఎలాంటి పాయింట్ దొరకకపోవడంతో ఎవరినో ఒకరిని నామినేట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపించింది. దాంతో తమను నామినేట్ చేసిన పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు. అయితే ఓ సిల్లీ రీజన్‌తో నామినేట్‌ చేశాడని నిఖిల్‌ పై పృథ్వీ కాస్త అలిగాడు. వీళ్ల సంగతి పక్కన పెడితే.. రెండో వారం నామినేషన్లలో ఎక్కువగా వైరల్ అయింది మాత్రం సోనియా ఆకుల మాటలు. యాంకర్ విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత దాడి చేసింది. నామినేషన్ల రోజు నుంచి సెప్టెంబర్ 11 ఎపిసోడ్ వరకు విష్ణుప్రియ పై కక్ష పెంచుకుందా అనేట్లుగా నిత్యం ఏదో ఒక మాట వదులుతూనే ఉంది.

కాగా, సోమవారం ప్రారంభమైన రెండో వారానికి సంబంధించిన నామినేషన్లు మంగళవారంతో ముగిశాయి. ఆ రాత్రి నుంచే ఓటింగ్ పోలింగ్ ప్రారంభమైంది. నిర్వాహకులు తమకు నచ్చిన ఒక పోటీదారునికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. బీబీ టీమ్ గత 7వ సీజన్ నుంచి ఒక ఓటు మాత్రమే లెక్కిస్తోంది. బిగ్ బాస్ 8 తెలుగు రెండవ వారం నామినేషన్లలో 8 మంది నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 8 నామినేషన్ల ఓటింగ్ ఫలితాల్లో రెండో వారంలో అత్యధిక ఓట్లతో సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ మొదటి స్థానంలో ఉన్నాడు. నిఖిల్‌కు 22.84 శాతం (4,702 ఓట్లు), విష్ణుప్రియ 19.92 శాతం (4,101 ఓట్లు)తో రెండో స్థానంలో నిలిచారు. తొలి వారం నామినేషన్స్‌లో విష్ణు ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగగా.. ఈసారి నిఖిల్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇక వరుసగా నాగ మణికంఠ 12.14 శాతం (2500 ఓట్లు)తో మూడో స్థానం, పృథ్వీరాజ్ 9.56 శాతంతో (1968 ఓట్లు) నాలుగో స్థానం, నైనిక 9.18 శాతం (1891 ఓట్లు) ఐదో స్థానం, 9.06 శాతం (1866 ఓట్లు)తో ఆదిత్యం ఓం ఆరో స్థానం, 8.75 శాతం (1801 ఓట్లు)తో ఏడో స్థానంలో శేఖర్ బాషా నిలిచారు. ఇక అట్టడుగున అందరికంటే చివరిలో 8 స్థానంలో కిర్రాక్ సీత ఉంది.

పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా మాట్లాడుతూ, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న కిర్రాక్ సీత చివరి స్థానానికి పడిపోవడంఆశ్చర్యానికి గురి చేసింది. పెద్దగా పీఆర్ టీం లేని సీతకి ఓటింగ్ ఇలాగే కొనసాగితే రెండో వారంలో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం వరకు ఓటింగ్‌లో మార్పులు జరిగి, ఆమె ఓటు బ్యాంకు పెరిగితే సీత సేవ్ అవుతుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!