ఈ మధ్య దర్శకులు ఖాళీగా ఉన్న సమయాలలో వారి సమయాన్ని వృధా చేసుకోకుండా వారి దగ్గర ఉన్న మంచి కథలను వేరొకరికి ఇచ్చి వారి బ్రాండ్ వేల్యూ పెంచుకుంటున్నారు. ఇలాంటి వాటిలో దర్శకుడు మారుతి అందె వేసిన చెయ్యి. మొదటి నుంచి తన క్రేయేటివిటీతో తన బ్రాండ్ వాల్యూని ప్రమోట్ చేస్తూ బాగానే గిట్టుబాటు చేసుకుంటాడు. ఇప్పుడు ఇలానే యాంకర్ ప్రభాకర్ దర్శకత్వంలో వస్తున్న “బ్రాండ్ బాబు” సినిమాకు మంచి కథను అందించినట్లు తెలుస్తుంది. కథతో పాటు మాటలు కూడా మారుతిని అందిస్తున్నాడు. ఈ సినిమాలో సుమంత్ శైలేంద్ర అనే కొత్త కుర్రాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

ఈ సినిమా టీజర్ ను చిత్ర బృదం తాజగా విడుదల చేసింది. ఆ టీజర్ లో మురళి శర్మతో వాయిస్ తో మొదలవుతూ “ఎదుటి వాటి వొంటి మీద బ్రాండ్ కనపడకపోతే మావాడి నోటి నుండి మాట కూడా రాదూ” అంటూ ఆసక్తిగా సాగుతుంది. ఈ సినిమాకు జెబి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాతగా ఎస్ శైలేంద్ర వ్యవహరిస్తున్నాడు. మారుతి గత చిత్రాలు బలే బలే మగాడివోయ్, మహానుభావుడిలా ఈ బ్రాండ్ బాబులో కూడా మంచి కాన్సెప్ట్ ఉందని టీజర్ చూస్తూనే తెలుస్తుంది.

బ్రాండ్ బాబు కథ అందించినందుకు దర్శకుడు మారుతికి కోటి రూపాయల వరకు ముట్టిందని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. ఎవరైన దర్శకుడు లేదా రచయిత మంచి స్క్రిప్ట్ అందిస్తే కోటి రూపాయల వరకు తీసుకోవడం ఇండస్ట్రీలో సర్వసాధారణమైపోయింది. దానితో పోల్చుకుంటే స్క్రిప్ట్ తో పాటు మాటలు కూడా అందిస్తున్న మారుతి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తక్కువే అని చెప్పుకోవచ్చు.

Tag : Maruthi, Brand Babu, Sumanth Sailendra, Brand Babu Teaser Release, Murali Sharma