‘శైలజారెడ్డి అల్లుడు’గా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య.. ఈ సినిమా చైతు కు మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది. ఇప్ప్పుడు తాజాగా ఆయన నటించిన మరో చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. చందు మొండేటి దర్శకత్వంలో చైతు నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇంతక ముందు వీరిద్దరి కాంబోలో ప్రేమమ్’ సినిమా వచ్చి మంచి హిట్ సాధించింది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటుంది. కాగా ఈచిత్రం యొక్క ఆడియో విడుదల వేడుకను వచ్చే నెలలో దసరాకి నిర్వహించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. కాగా ఈచిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.