Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ రెండో వారంలో నామినేషన్ల పేరుతో హౌస్‌లో ఉత్కంఠ నెలకొంది. మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ కావడంతో హౌస్ మెట్స్ లో ఓ భయం మొదలైంది. మనల్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలనే స్వార్థం పెరిగింది. అందుకే ఈ వారం నామినేషన్స్ లో తమకంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. నిన్నటి ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. నామినేషన్ల ఘట్టంలో మాటల యుద్ధం చేసిన హౌస్‌మేట్స్.. ఆ తర్వాత తిండి కోసం తెగ హడావుడి చేశారు. ఇక తినడానికి ఫుడ్ ఉండదేమో అన్న కక్కుర్తితో పడి పడి మరి తిన్నారు. అది కాస్త ట్రోల్స్ అందుకుంటుంది. నిన్నటి ఎపిసోడ్ హైలెట్స్ ను ఒకసారి చూసేద్దాం..
గత వారం ఎపిసోడ్‌లతో పోలిస్తే, ఈ వారం కాస్త టఫ్ గానే మారింది. ఈ రెండో వారంలో మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నయనిక, విష్ణు ప్రియలు నామినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ తన కంటెస్టెంట్స్ కి ఇచ్చిన రేషన్ లాక్కున్నాడు. ఏది తినాలన్నా.. వండాలన్నా.. మీరే సంపాదించుకోవాలని అన్నారు. మరి ఈ పదో ఎపిసోడ్ ఎలా సాగిందో చూద్దాం.
మంగళవారం నాటి ఎపిసోడ్ నామినేషన్లతోనే మొదలైంది.. సీత, సోనియా వార్ ఓ రేంజ్ లో ఉన్నా.. ఆదిత్య కూడా వారికి ఏం తగ్గలేదు. మణికంఠ శేఖర్ భాష లు కూడా చిన్న పాయింట్ తీసుకొని నామినేట్ చేశారు. ఇంటి చీఫ్‌గా నిఖిల్ విఫలమయ్యాడని, ఫుడ్ అందరికీ ప్రిపేర్ చేసి పెట్టేలా టీంను చూసుకోలేదని, లంచ్ ప్రిపరేషన్ జరగలేదనే కారణాలు చెప్పి ప్రేరణ నామినేట్ చేసేసింది. అలాగే సీతను నామినేట్ చేస్తూ.. వాదిస్తూనే ఉంటావు.. ఎదుటివాళ్లు మాట్లాడనివ్వరు.. ఎదుటివాళ్ల మాట వినరు.. పనుల్లో క్లారిటీ లేదు.. డస్ట్ బిన్లోంచి తీసింది.. ఇది ఫీల్ అవ్వాల్సింది నేను.. ఆమె ప్రేరణ కారణాలు చెప్పింది. అక్కడ ప్రేరణ చెప్పిన దానికి సీత ఒప్పుకోలేదు.. నా తప్పేమీ లేదని, నాకు క్లారిటీ ఉందని.. అది సరైనదనిపిస్తే.. నేను పోరాడతాను.. వంద మందితో అయినా సరే పోరాడతాను, వెనక్కి తగ్గను. అంటూ సీత కూడా సోనియాను గట్టిగానే వేస్కోంది. ఈ వారం ఒక్క యష్మీ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.
నామినేషన్ల పర్వం కొనసాగుతుండగానే హౌస్‌మేట్స్‌కి బిగ్‌బాస్ తీపి వార్త అందించాడు. అదేంటంటే.. హౌస్ మేట్స్ అందరికీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ పంపించాడు బిగ్ బాస్. కాస్త సమయం తీసుకుని ఈరోజు మీకు కావలసినది తినండి. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పినప్పుడు. అందరూ తిండి మీద పడిపోయారు. ఆవురారమని తిన్నాడు. ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. బిగ్ బాస్ షోకు కేవలం తినడానికే వచ్చినట్లు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది.