కింగ్ నాగార్జున, నాని మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య డార్కత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లగా నటించారు. సెప్టెంబర్ 27 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది. ఈ సినిమా అమెరికాలో అర్ధ మిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. సినిమా శనివారానికి (సెప్టెంబరు 29) 558,592 డాలర్లు (రూ.4.05 కోట్లు) వసూలు చేసినట్లు చెప్పారు. త్వరలోనే మిలియన్‌ డాలర్ల మార్కును అందుకుంటుందని అభిప్రాయపడ్డారు. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మించారు.

నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు, సమంత ‘యు టర్న్‌’ సినిమాలు రిలీజ్‌ కావడం, అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ షూటింగ్‌కి గ్యాప్‌ దొరకడంతో సేద తీరడానికి హాలీడే వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత ‘దేవదాస్‌’ రిలీజ్‌ చూసుకొని అమలతో కలసి నాగార్జున కూడా వాళ్లతో జాయిన్‌ అయ్యారు. ఇలా ఫ్యామిలి అంత సరదాగా హాలీడే మూడ్‌లోకి వెళ్లారు.

Nagarjuna family