Friday, October 4, 2024

Bigg Boss 8 : అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.. రెండో వారం ఎలిమినేషన్ అయ్యేది అతనే !

- Advertisement -


Bigg Boss 8 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్లీ షో బిగ్ బాస్ సీజన్ 8 కాస్త కొత్తగా సాగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా టైమ్ పాస్ చేస్తు్న్నారు అనుకున్న కంటెస్టెంట్లు రెండో వారంలో మాత్రం విజృంభిస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ లోనూ పోటీపడి ఆడుతున్నారు. బుధ వారం నుంచి జ రుగుతున్న టాస్కులు కేవలం తమ ఫుడ్ ను సంపాదించుకునేందుకు మాత్రమే అన్నట్లు ఉన్నాయి. ఫుడ్ కోసమే టాస్కుల్లో పాల్గొంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ వారం ఎపిసోడ్‌లు అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయి బయటకు పోతారో అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే జనాల ఊహకు ఏమాత్రం అందని వారిని బిగ్ బాస్ హౌసు నుంచి ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండో ఎలిమినేషన్ కూడా ట్విస్టులతోనే జరుగుతుందని ప్రేక్షకులు ఊహిస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారో చూసేద్దాం..

మొదటి వారంలోనే బేబక్క ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.. రెండో వారం కూడా త్వరలో పూర్తి కాబోతోంది. ఇవాళ అంటే శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. ఈ క్రమంలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఎలిమినేషన్‌కు ముందు అసలు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో ఓ సారి చూద్దాం. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడానికి నామినేట్ చేయబడిన హౌస్‌మేట్స్ శేఖర్ భాషా, పృధ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య, నాగ మణికంఠ, నైనికా, సీత, విష్ణు ప్రియ. వీరంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే.. మరి వీరిలో ఎవరు బయటకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ వారం నామినేట్ అయిన వారిలో ఆదిత్య, శేఖర్ బాషా తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అందరి అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్ చూస్తుంటే.. ఈ వారం ఎలిమినేషన్ రిస్క్ ఎక్కువగా ఉన్న వ్యక్తి.. శేఖర్ బాషా అని చెప్పొచ్చు. అలాగే మరో కంటెస్టెంట్ సీతకు కూడా తక్కువ ఓట్లే పడ్డాయి. సీత, శేఖర్ భాషా ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశం ఉంది. శేఖర్.. ఆదిత్యతో పోలిస్తే టాస్క్‌లలో అంతగా రాణించలేకపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో శేఖర్ భాషా జోకులు ట్రెండింగ్‌లో ఉండగా.. ఈ వారం సీతను గేమ్ నుండి తప్పించే అవకాశం ఉందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.. బిగ్ బాస్ షో నిర్వాహకుల నిర్ణయాలతో.. ఈ గేమ్‌లో ఏం జరుగుతుందో ఊహించడం అంత ఈజీ కాదు. మరి ఈ వారాంతంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!