ఆడియో ఫంక్షన్ లో నిర్మాతలు వారి వారి సినిమాల గురించి గొప్పలు చెప్పుకోవడం సర్వసాధారణం. కానీ ఇంకొక అడుగు ముందుకేసి నిర్మాత దిల్ రాజు తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకుంటూ, తన సినిమాలలో హీరోలుగా నటించిన వారిని తక్కువ చేస్తూ మాట్లాడి వార్తలలోకి ఎక్కాడు. నాతో సినిమా తీయడానికి నితిన్ అర్రులు చాచాడని, అంకుల్ నాకు ఒక హిట్ ఇవ్వు అని అడిగాడని ఎన్నెన్నో మాటలు చెప్పాడు. ఇన్ని రోజులకు నితిన్ తో సినిమా చేసే ఛాన్స్ దొరికిందని, “శ్రీనివాస కళ్యాణం” సినిమా నితిన్ కెరీర్ లో పెద్ద హిట్ అవుతుందని ఎన్నెన్నో విషయాలు చెప్పాడు.

కట్ చేస్తే సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు డిజాస్టర్ వైపు అడుగులు మెల్ల మెల్లగా పడుతున్నాయి. నిన్న ఆదివారం వరకు “శ్రీనివాస కళ్యాణం” సినిమా మొత్తం మీద ఐదు కోట్ల రూపాయల షేర్ కూడా సాధించినట్లు లేదు. ఇక ఈరోజు సోమవారం కావడంతో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. ఈ బుధవారం విడుదలకు సిద్ధంగా ఉన్న “గీత గోవిందం” సినిమాపై బారి అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఆ సినిమా కనుక యావరేజ్ టాక్ వస్తే “శ్రీనివాస కళ్యాణం” సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు కొంత ఊరట లభిస్తుంది. ఒకవేళ గీత కనుక హిట్ అయితే కళ్యాణం ఇక థియేటర్స్ నుంచి సర్దుకోవలసిన పరిస్థితి నెలకొంటుంది.

దిల్ రాజు లవర్స్ విషయంలో కూడా రాజ్ తరుణ్ ను కొంత తక్కువ చేసి మాట్లాడాడు. హీరోపై ఏడూ కోట్లు ఖర్చు చేయాల్సినది కాదు అంటూ ఏవేవో కథలు చెప్పాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బారి అపజయాన్ని మూటకట్టుకుంది. ఇక వరుసగా “లవర్, శ్రీనివాస కళ్యాణం” సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అవ్వడంతో దిల్ రాజు చరిత్ర మసకబారుతుందా అనిపిస్తుంది.