దిల్ రాజు సినిమా ఇండస్ట్రీలోకి పంపిణి రంగం ద్వారా అడుగుపెట్టి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా అనేక సేవలు అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన “శ్రీనివాస కళ్యాణం” సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. దిల్ రాజు తన సినిమాలు నిర్మించే సమయంలో కొత్త దర్శకులను బాగా ఇబ్బంది పెడతాడని టాక్ ఉంది. ఆ దర్శకుడిని తన పాటికి తాను దర్శకత్వం చేసుకోనివ్వకుండా మధ్యలో వేలు పెట్టి దిల్ రాజు దర్శకత్వం చేస్తాడని ఎప్పటి నుంచో ఒక రూమర్ ఉంది.

ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న “శ్రీనివాస కళ్యాణం” విషయంలో కూడా అలానే చేసాడని విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు సతీష్ విగ్నేష్ “శతమానం భవతి” సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అదే బ్యానర్ లో “శ్రీనివాస కళ్యాణం” సినిమాకు దర్శకత్వం వహించాడు. మధ్యలో దిల్ రాజు కల్పించుకొని సినిమాను తనకు నచ్చిన విధంగా మార్చే పని చేసాడని, దీనిపై సతీష్ చాల అసహనం చెందాడని వార్తలు వినిపించాయి. దీనిపై దిల్ రాజు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తారో తెలియదని, మేమంతా కార్మికులమని కలసి పనిచేస్తామే తప్ప ఇలాంటివి ఎప్పుడు చేయలేదని. నేను దర్శకుల వెనక మాత్రమే ఉంటానని, నేను కథ విన్న తరువాత దర్శకుడితో ప్రయాణం చేస్తానని, నా ప్రయాణం ఎలా సాగుతుందో నాకు మాత్రమే తెలుసని దయచేసి ఇలాంటి వార్తలు రాయవద్దని తెలియచేసారు. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు దిల్ రాజు దర్శకుడి చేయవలసిన పనిలో చేతులు పెట్టకపోతే ఇలాంటివి పుట్టే అవకాశమే ఉండదు కదా?