వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ‘యాత్ర’ సినిమా ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘యాత్ర’ సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే యూఎస్ తో సహా అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ డ్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. యాత్ర మంచి ఓపెనింగ్స్ తో మొదలవబోతుందన్న ఆయన.. ఇక ఈ సినిమాను నైజాంలో అలాగే వైజాగ్ లో కూడా మా సంస్థనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుందన్నారు. ఇక ఈ యాత్ర సినిమా చాలా పెద్ద స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని దిల్ రాజు తెలిపారు.

ఇక ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్మూట్టి, రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటించారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు యాంకర్ అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.