ఒక దర్శకుడు ఎంపిక చేస్తేనే ఆ హీరోయిన్ కు ఆ సినిమాలో ఛాన్స్ దక్కుతుంది. కానీ అదే దర్శకుడి ముఖం పగలగొడితే ఆ దర్శకుడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని అంజలి భయపడుతుంది. అసలు దర్శకుడి ముఖం పగలగొట్టి బాధపడవలసిన అవసరం ఏమొచ్చిందో అని అరా తీస్తే “లీసా” సినిమా షూటింగులో పాల్గొంటున్న అంజలి ఒక యాక్షన్ సీన్ లో నటించాల్సి ఉంది.

ఆ సీన్ లో నటించే క్రమంలో హీరోయిన్ అంజలి తన చేతిలో దోస పెనాన్ని కెమెరా ముందుకు విసిరి వేయాలి. అంజలి కోపంగా దోస పెనాన్ని కెమెరా ముందు విసిరింది. ఆ క్రమంలో కెమెరా పక్కన ఉన్న దర్శకుడి మొహాన్ని నేరుగా తాకడంతో అతనికి కనుబొమ్మల మధ్య తీవ్ర గాయమైనది. దీనితో వెంటనే దర్శకుడిని దగ్గరలో హాస్పిటల్ కు తీసుకొని వెళ్లి కుట్లు వేయించారు. దీనితో అంజలి తెగ బాధపడిపోతుందని తెలుస్తుంది. కావాలని చేయలేదని చెప్పడంతో యూనిట్ సభ్యులు షూటింగులో ఇవన్నీ మాములే అని సర్ది చెప్పరటా.