Bigg Boss 8 : బిగ్ బాస్.. 12వ ఎపిసోడ్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్లందరూ ఇప్పటివరకు వారు సంపాదించిన ప్రైజ్ మనీ ఎంతో వెల్లడించారు. సాధారణంగా ప్రతి సీజన్లోనూ విజేతకు ఫిక్స్ డ్ ప్రైజ్ మనీని బిగ్ బాస్ అందజేస్తారు. ఇది సుమారు రూ. 50 లక్షలు. అలాగే, ప్రైజ్ మనీతో పాటు, విజేతకు కొన్ని స్పెషల్ అసెట్స్ కూడా లభించే అవకాశం ఉండేది. ఉదాహరణకు, బిగ్ బాస్ ప్రైజ్ మనీతో పాటు ఇంటి స్థలం, కారు మొదలైనవి గెలుచుకునే వారు. అయితే ఈ బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ లో జీరో ప్రైజ్ మనీ అని ముందే తెలిపారు. అంటే, ప్రైజ్ మనీ సున్నా నుంచి మొదలై అనంతం వరకు వెళ్తుంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్లు తమ ప్రవర్తన, హౌస్‌లో ఆడే టాస్క్‌లను బట్టి వారి ప్రైజ్ మనీని పెంచుకోవచ్చు. అలా మొదటి వారంలో హౌస్‌లోని 14 మంది కంటెస్టెంట్స్ రూ. 5 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ కు నాగార్జున రూ. 5 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు. అయితే అందులో ఎంత మొత్తం ఇవ్వాలో బిగ్ బాస్ నిర్ణయిస్తారు. నాగార్జున ప్రకటించిన ప్రైజ్ మనీ నుంచి రూ. బిగ్ బాస్ 2 లక్షలు కట్ చేసి కేవలం 3 లక్షలు మాత్రమే ప్రైజ్ మనీగా ఫిక్స్ చేశారు. నామినేషన్ల తర్వాత రెండో వారంలో ఆ రూ. 2 లక్షలు సంపాదించేలా టాస్క్‌లు ఇచ్చాడు బిగ్ బాస్. మూడు క్లాన్లు ఈ టాస్క్‌లలో పాల్గొని బిగ్ బాస్ ప్రైజ్ మనీని పెంచుకున్నాయి. టాస్క్‌లు ఆడి నైనికా క్లాన్ రూ. 75 వేలు సంపాదిస్తే.. హౌస్ లో అతి పెద్ద క్లాన్ అయిన యష్మీ టీమ్ రూ. 1,25, 000 సాధించారు. ఒకే ఒక్క నాగ మణికంఠతో అతి చిన్న క్లాన్ అయిన నిఖిల్ అత్యధికంగా రూ. 2 లక్షల 45 వేలు సంపాదించాడు. అందరికంటే ఎక్కువ అమౌంట్ ఏది ఉంటుందో అది విన్నర్ ప్రైజ్ మనీలోకి జత చేస్తారని టాస్క్‌లకు ముందే బిగ్ బాస్ ప్రకటించాడు.
కాబట్టి రూ.2,45000 ప్రైజ్ మనీకి జోడించబడింది. మొత్తం బిగ్ బాస్ విజేత ప్రైజ్ మనీ రూ. 5 లక్షల 45 వేలు. ఈ మొత్తాన్ని బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విజేతకు అందజేయనున్నారు. ఈ ప్రైజ్ మనీ రోజు రోజుకు పెరిగే అవకాశం ఉంది. అలాగే మధ్యమధ్యలో హౌస్ మేట్స్ చేసే పనుల కారణంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఆరుగురు కొత్త సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మూడో వారంలోనే కొత్త హౌస్ మేట్స్ వచ్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఈ ఆరుగురిలో జబర్దస్త్ అవినాష్ పేరు బలంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు రెండు సార్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది మూడోసారి అవుతుంది. కామెడీ కోసమని జబర్దస్త్ అవినాష్‌ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే జబర్దస్త్ రోహిణి కూడా వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ 8 తెలుగులోకి ప్రవేశిస్తుందనే టాక్ కూడా ఉంది. మరి వైల్డ్ కార్డ్ తో ఎవరెవరు వస్తారో చూడాలి.