విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ సినిమా ఎఫ్-2. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకుపోతుంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్ లుగా నటించారు. సినిమా హిట్ అయినా నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో చిట్ చాట్ చేశారు. దర్శకుడిగా ఇది వరకు వాణిజ్య హంగులతో కూడిన యాక్షన్ సినిమాలు చేశాను. వాటికి భిన్నంగా పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో ఓ సినిమా చేస్తే బాగుండునని అనిపించింది. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ తెలుగులో వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేస్తూ ఈ సినిమా చేశానన్నారు.

అలాగే ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర, ఆయన మేనరిజమ్స్ మంచి స్పందన లభిస్తున్నది. అలాగే బోరబండ కుర్రాడిగా వరుణ్ తేజ్ సహజమైన అభినయాన్ని కనబరిచాడు. బాలీవుడ్ గోల్ హౌస్ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్ సృష్టించాయి. వాటి తరహాలో ‘ఎఫ్-2’ కు సీక్వెల్ చేయాలనుంది. ఈ సీక్వెల్ నటించడానికి వెంకటేష్, వరుణ్ సంసిద్ధతను వ్యక్తం చేశారని అనిల్ రావిపూడి అన్నారు.