“గీత గోవిందం” దెబ్బకు మిగతా అన్ని సినిమాలు చాప చుట్టేసాయి. విజయ్ దేవరకొండ క్రెజ్ తో పాటు, సినిమాలో మంచి కంటెంట్ ఉండటంతో ఈ వారాంతం గీత దున్నేసేలా ఉంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్స్ లో శనివారం, ఆదివారం టికెట్స్ ఫుల్ అయిపోయాయి. గత బుధవారం విడుదలైన “గీత గోవిందం” సినిమా మొదటి మూడురోజులల్లో 13 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు తెలుస్తుంది. సినిమా ఫ్లోటింగ్ ని దృష్టిలో పెట్టుకొని నైజాం ఏరియా లో థియేటర్స్ సంఖ్య అమాంతం పెంచేశారు. మొత్తం మీద గీత శని ఆదివారాలలో ఇంకో ఎనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసి సోమవారానికి 20 కోట్ల రూపాయల మార్క్ దాటనుందని తెలుస్తుంది.  

 

గీత గోవిందం మొదటి మూడు రోజుల కలెక్షన్ వివరాలు

నైజాం          5.01 కోట్లు

సీడెడ్          2.01 కోట్లు

వైజాగ్          1.34 కోట్లు

గుంటూరు    1.29 కోట్లు

ఈస్ట్             1.09 కోట్లు

కృష్ణా            1.04 కోట్లు

వెస్ట్              0.97 కోట్లు

నెల్లూరు       0.44 కోట్లు