టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాలో ఏదో తెలియని వెలితిలా ఉండేది, సినిమాలో మొదటి సారి హీరో కనిపించినప్పుడు ఎంత హంగామా కనపడేదో, బ్రహ్మానందం కనపడినప్పుడు కూడా అదే రీతిలో విజిల్స్ పడేవి. బ్రహ్మానందం రేంజ్ తెలుగు ఇండస్ట్రీలో ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు బ్రహ్మానందం తన మార్క్ కోల్పోయాడు. ఎంత సేపు అదే మూస ధోరణి కామెడీ చేయడంతో రాను రాను బ్రహ్మానందంను ఆదరించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు కొత్త తరం కమెడియన్స్ వచ్చి ఇండస్ట్రీ దున్నేస్తున్నసమయంలో బ్రహ్మానందం ఒకటి, రెండు సినిమాలలో కనిపించడం తప్ప పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు.

బ్రహ్మానందం మంచి ఫామ్ లో ఉన్నప్పుడు బ్రహ్మానందం కొడుకు గౌతమ్ సినిమాలు బ్రహ్మానందం ప్రెజెంట్ చేసేవాడు. బ్రహ్మానందాన్ని నమ్ముకొని సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు సినిమాలో కంటెంట్ లేకపోవడంతో నిరాశే మిగిలేది. కానీ బ్రహ్మానందం పేరు చెప్పుకొని సినిమా కలెక్షన్స్ బాగానే రాబట్టేవారు. ఇలా గౌతమ్ నటించిన సినిమాలు అన్ని ప్లాపుల బాట పట్టడంతో, చాల గ్యాప్ తరువాత మరలా తన సినిమాతో ప్రేక్షకుల ముందకు వస్తున్నాడు. కానీ ఇప్పుడు బ్రహ్మానందం నమ్ముకుంటే సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకాదరణ పొందటం కష్టం. ఇప్పుడు కూడా గౌతమ్ తన తండ్రి బ్రహ్మానందాన్ని నమ్ముకోవడం కంటే ఇప్పటికైనా కంటెంట్ నమ్ముకుంటే మంచి విజయం సాధించవచ్చు .

గౌతమ్ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తో పేరుతెచ్చుకున్న ఫణింద్ర నరిశెట్టి క్రౌడ్ ఫండింగ్ తో తీస్తున్న “మను” సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను యూఎస్ లో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే నిరావణ సంస్థ విడుదల చేయబోతుంది.విదుదల పరంగా ఎటువంటి సమస్యలు ఎదురవ్వకపోయినా, తన తండ్రి పేరుతో కాకుండా మంచి కంటెంట్ తో వస్తే గౌతమ్ ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాలో యూట్యూబ్ బ్యూటీ చాందిని చౌదరి నటించడం విశేషం. ఈ బ్యూటీకి ఇప్పటి వరకు హిట్ సినిమాలు లేకపోవడంతో, గౌతమ్, చాందిని చౌదరి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Tags : Brahmanandham, Gowtham, Manu, Chandini Chowdary, Nirvana Movies