Thursday, October 3, 2024

Bigg Boss 8: బిగ్ బాస్ లో రూల్ ఛేంజ్…గమనించారా ?

- Advertisement -


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రియాల్టీ షో మొదలై మరో రెండు రోజులు పూర్తయితే రెండు వారాలు అవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో ఇప్పటికే ఓ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది. రెండో వారంలో భాగంగా మరికొందరు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఈ వారం కిరాక్ సీత ఇంటి నుంచి వెళ్లిపోనుందని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక బిగ్ బాస్ ప్రోగ్రాం అంటే ఇంట్లో ఎన్నో గొడవలు, పొట్లాటలు మామూలే.. లవ్ ట్రాక్ కూడా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ కొన్ని కఠినమైన నిబంధనలను కూడా విధించారు. ఇది తెలుగు సీజన్ కావడంతో కంటెస్టెంట్స్ తెలుగులోనే మాట్లాడాలనే నిబంధనను మొదటి సీజన్ నుంచి కొనసాగించారు. అయితే గత రెండు మూడు సీజన్ల నుంచి ఈ నిబంధన పెద్దగా పాటించడం లేదని తెలుస్తోంది.

తెలుగు రాని వారికి తెలుగు నేర్పించే బాధ్యతను బిగ్ బాస్ అప్పగించేవారు. కానీ ప్రస్తుత సీజన్లలో తెలుగు తెలిసిన వారు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. హోస్ట్ నాగార్జున స్వయంగా ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పటికీ బిగ్ బాస్ ఎలాంటి ఆంక్షలు విధించడం లేదు. దీంతో హౌసులో తెలుగులోనే మాట్లాడాలని నిబంధనలు మార్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు పగటిపూట నిద్రపోతే కుక్క అరుపులు వినిపించేవి కాబట్టి కంటెస్టెంట్లకు శిక్ష పడింది. ఇక పగటి పూట నిద్రపోయే వారిని పెద్దగా పట్టించుకోకపోవడంతోపాటు స్మోకింగ్ ఏరియా కూడా ఎక్కువగా చూపించకపోవడంతో కంటెస్టెంట్స్ ప్రైవసీకి బిగ్ బాస్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎనిమిదో సీజన్ మొదటి వారం చాలా బోరింగ్ గా అనిపించింది. అయితే రెండో వారంలో పెద్ద ఫైట్ జరగడంతో ప్రేక్షకులకు మంచి కంటెంట్ దొరికి నట్లు అయింది. కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టఫ్ టాస్క్ లు ఇస్తుండడంతో కాస్త ఆసక్తికరంగా మారుతోంది. మరి రెండో వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!