అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలలో ఘాటు ముద్దుల తాకిడికి థియేటర్స్ వైపు యూత్ పరుగులు తీశారు. పెట్టిన పెట్టుబడికి ఐదింతలు వసూళ్లు కురిపించాయి. ఇక ఆ రెండు సినిమాలలో నటించిన హీరోయిన్స్ కూడా అవకాశాలు బాగా వస్తున్నాయి. ఈ ముద్దుల సెగతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ రెండు సినిమాల బాటలో మరి కొన్ని సినిమాలు తయారవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు హెబ్బా పటేల్ హీరోయిన్ గా “24 కిస్సెస్ ” అనే సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య 24 భంగిమలలో ముద్దులు పెట్టించే సీన్లు ఉన్నాయని, ఆ సీన్లు యూత్ కు సెగ పుట్టించడం ఖాయమని చెబుతున్నారు. హెబ్బా పటేల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మంచి హిట్స్ సాధించి యువ హృదయాలలో స్థానం సంపాదించింది. కానీ తరువాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కొంత వెనకపడింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ డబ్బులు ఎక్కువ ఇస్తే ఎన్ని ముద్దులు పెట్టడానికైనా తాను సిద్ధమని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతుంది. “24 కిస్సెస్” సినిమాలో హెబ్బా పటేల్ పెట్టె ముద్దులు చూసి సినిమాకు ఎక్కువ డబ్బులు తీసుకుందా? తక్కువ డబ్బులు తీసుకుందా అనేది చెప్పేయ వచ్చు అనమాట. చూద్దాం ఆ రెండు సినిమాలలా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో త్వరలోనే తేలనుంది.