రామ్ – అనుపమ హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా, త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న “హలో గురూ ప్రేమ కోసమే” టీజర్ ఈరోజే విడుదలైంది. ఈ టీజర్ మొత్తం కొంత రొమాంటిక్ గా హాట్ హాట్ కాఫీని జోడిస్తూ విడుదల చేసారు. ప్రేమ కథ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తగట్లు టీజర్ కూడా యూత్ నీదృష్టిలో పెట్టుకొని విడుదల చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో యూత్ ను ఆకట్టుకోవడానికి నిర్మాతలు టీజర్, ట్రైలర్స్ కట్ చేస్తూ సినిమాకు ముందే మంచి బజ్ తీసుకువస్తున్నారు. అక్టోబర్ 18 న సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.