మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “అరవింద సమేత” సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నెల 15వ తారీఖున సినిమా టీజర్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటుంది. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తారీఖున విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఇప్పటికే సిద్ధమైంది.

కానీ సినిమాకు సంబంధించిన పాటలు ఇంత వరకు ఒక కొలిక్కి రాకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశముందని చిత్ర వర్గాలు తెలియచేస్తున్నాయి. కానీ సినిమాకు ఎటువంటి బ్రేకులు ఇవ్వకుండా చక చక షూటింగ్ పూర్తి చేసే కార్యక్రమాలలో చిత్ర యూనిట్ మునిగిపోయి ఉంది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు మంచి కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంతో కామెడీ నుంచి హీరోగా హీరోగా ఎదిగిన సునీల్ మరలా యుటర్న్ తీసుకుని కమెడియన్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నాడు. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో మొదటి సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక త్రివిక్రమ్ గత సినిమా “అజ్ఞాతవాసి” ప్లాప్ తరువాత వస్తున్న “అరవింద సామెత”తో తిరిగి ఫామ్ అందుకోవాలని ఉబలాట పడుతున్నాడు.