ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి రోజుకొక బ్రేకింగ్ న్యూస్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే బసవతారకం పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించడానికి సిద్ధమయ్యారు. ఇక సినిమాలో హరికృష్ణ క్యారెక్టర్ కు సంబంధించి నందమూరి కళ్యాణ్ రామ్ నటించనున్నాడని ఇప్పటికే తెలుస్తుంది.

జూనియర్ కూడా నటిస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. ఆ కోరిక తీరనుందని చిత్ర వర్గాల ద్వారా తెలుస్తుంది. కానీ చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జూనియర్ నటిస్తే సినిమా మరో రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనపడుతుంది. బాలకృష్ణకు… జూనియర్ కు ఎప్పటి నుంచి మనస్పర్థలు ఉన్నాయి. అందుకే జూనియర్ కూడా మహానటిలో ఎన్టీఆర్ పాత్రను పోషించమని అడిగినప్పుడు బాలకృష్ణ నొచ్చుకుంటాడేమో అన్న కారణంతో దూరంగా ఉన్నాడు. ఇప్పుడు దర్శకుడు క్రిష్ కల్పించుకొని జూనియర్ ను నటింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జూనియర్ కనుక నటిస్తే ఎవరి పాత్ర పోషిస్తాడనేది ఇంకా స్పష్టత లేదు. యంగ్ ఎన్టీఆర్ పాత్ర అయితే జూనియర్ కు సరిగ్గా సూట్ అవుతుంది. మరి క్రిష్ మనస్సులో ఏముందో అతి త్వరలోనే తెలియనుంది.