Friday, October 4, 2024

Bigg Boss 8.. కితకితలు సినిమా చూసినట్లుంది.. నాగమణికంఠ భార్యపై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సిస్టర్

- Advertisement -


Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8లో అరంగేట్రం చేసిన నాగ మణికంఠ హౌస్‌లో సింపథీ గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలను ప్రేక్షకుల నుంచి ఎదుర్కొంటున్నారు. కానీ అదే సింపథీ అతన్ని మొదటి వారం ఎలిమినేషన్ నుండి కాపాడిందని చెప్పవచ్చు. ఇంట్లో తన భార్య గురించి మణికంఠ చెప్పిన మాటలతో ఆమె పై బీబీ ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందరూ ఆమెను పెద్ద విలన్ అని అనుకుంటున్నారు. అయితే బిగ్‌బాస్‌లోకి రావడానికి తన భార్యే కారణమని, షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించింది అంటూ మళ్లీ హౌస్ లో చెప్పుకొచ్చాడు.. దీంతో అభిమానులే కాకుండా నెటిజన్లు కూడా నాగ మణికంఠ కుటుంబం గురించి తెలుసుకోవాలని, ఆయన భార్య, కూతురు ఫోటోలు చూడాలని గూగుల్ లో సెర్చ్ చేశారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నాగమణికంఠ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

నాగ మణికంఠ శ్రీ ప్రియ అనే అమ్మాయిని పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి వీడియోలో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో ఆమె శరీరాకృతిపై నెటిజన్లు చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మాయి కోసమా నువ్వు ఎంతగా ఏడ్చావు.. మన అందరికీ కితకితలు 2 సినిమా చూసినట్టుంది అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నాడు అంటూ చాలా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో మణికంఠ సోదరి కావ్య అమర్‌నాథ్‌ తన వదిన పక్షాన నిలబడి మణికంఠ భార్యపై వస్తున్న వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కావ్య అమర్‌నాథ్ మాట్లాడుతూ.. అన్నయ్య వదినల పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది. ఆ వీడియోపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూసి చాలా బాధపడ్డాను. కితకితలు సినిమా సెకండ్ పార్ట్ చూస్తున్నట్టుగా ఉంది అంటూ ఆమె శరీరాకృతి పై జోకులు వేయడం సరికాదు. ఇది చాలా హీనమైన చర్య అని నేను భావిస్తున్నాను. మా వదని సౌందర్యవతి, ఆమె మనసు బంగారం, ఆమె చాలా ప్రేమగల వ్యక్తి, ఆమె దయా గుణం కలది, ఇలా అనేక లక్షణాలు ఆమెను మరింత అందంగా మార్చాయి. మనకు తల్లి లేకపోవచ్చు కానీ ఆమె మనకు తల్లిగా నిలిచింది. ఆమెపై బాడీ షేవింగ్ ఆపండి. బరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి ఎక్కువ నష్టం కలుగుతుంది.. దయచేసి ఇతరులను నొప్పించకండి.. మీ నెగిటివిటీని పక్కనపెట్టి ప్రేమను పంచండి. అవతలి వారు ఎలా ఉన్నారు అన్న దానికి బదులుగా ఎలాంటి వారో తెలుసుకుని వారిని మెచ్చుకోండి అంటూ కావ్య చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే తన వదిన గయ్యాలి కాదు దేవత అంటూ ఒక మాటలో క్లారిటీ ఇచ్చింది కావ్య. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!