సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన చాలామంది ప్రముఖులు నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి విలన్ రోల్స్ ప్లే చేస్తున్న జగపతిబాబు ఇందులో ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు.

ఈ రోజు జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన ఫస్ట్ లుక్ విడుదలచేసింది. ఇందులో జగపతి బాబు వీరా రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. లాంగ్ హెయిర్ తో వీరయోధుడిలా ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగష్టు 15 న విడుదుల చెయ్యబోతున్నారు.