శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మొదటి సినిమా “ధఢక్” తో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరడం తో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. జాన్వీ నటించిన మొదటి సినిమానే 100 కోట్ల క్లబ్ లో చేరడంతో జాన్వీ కూడా మంచి ఖుషి ఖుషీగా ఉంది. ఇదే ఊపులో జాన్వీ కపూర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న “తక్త్” సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ముగిసిన వెంటనే జాన్వీ కపూర్ చేత సౌత్ ఇండస్ట్రీలో నటింప చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అనేక వార్తలు వచ్చాయి.

ఈ సినిమా హీరోగా సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటించవచ్చని అనేకమైన వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. కానీ దీనిపై జాన్వీ కపూర్ స్పందిస్తూ అసలు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఎవరు నన్ను ఇంత వరకు సంప్రదించలేదని, ప్రస్తుతం తాను బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నానని, అక్కడ మంచి నటిగా గుర్తింపు పొందిన తరువాత సౌత్ సినిమాలపై ద్రుష్టి పెడతానని జాన్వీ తెలియచేసింది. జాన్వీ ప్రస్తుతం నటిస్తున్న “తక్త్” సినిమా ముగిసిన వెంటనే కరణ్ జోహార్ దర్శకత్వంలో మరో సినిమా సినిమా చేయవలసి ఉంది. అంటే జాన్వీ పై ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయింది.