తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్ రానున్న సంగతి తెలిసిందే. ఈ రోజు జయలలిత వర్ధంతిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ జయలలిత బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాకు ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. జయలలిత పాత్రలో ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ నటిస్తుంది. లుక్‌లో నిత్యామేనన్‌ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. అచ్చం ఆమెలాగే కన్పిస్తున్నారు.

ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని పేపర్‌ టేల్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. మరోపక్క ‘మదరాస పట్టణం’ ఫేమ్‌ విజయ్‌ కూడా జయలలితపై బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. తమిళనాడు ప్రజల గుండెలో అమ్మగా ముద్ర వేసుకున్న జయలలిత.. కన్నడలో ‘శ్రీశైల మహత్మ్యం’ అనే చిత్రం ద్వారా బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. 2016లో అనారోగ్యంతో జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.