బుల్లి తెరలో సమాజక చైతన్యం ప్రోగ్రామ్స్ తో పాటు, నటిగా, యాంకర్ గా ఝాన్సీ చాల పాపులర్. ఝాన్సీ మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైనా కొన్ని విషయాల గురించి ప్రస్తావించింది. వాటి గురించి ప్రస్తావిస్తూ నేను వర్క్ ఇవ్వమని ఇప్పటి వరకు ఎవరని అడగలేదు, అలాగే అవతల వాళ్ళు ఇవ్వవలసిన డబ్బుల గురించి నేను ఎక్కువగా అడగలేదు. నాకు ఎవరైనా డబ్బులు ఎగ్గొడితే, మనుషులను పంపించి గొడవలు చేయలేదు, వారితో గొడవకు దిగకుండా వారిని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తానని ఝాన్సీ చెప్పింది.

ఝాన్సీకి తన కెరీర్ లో జరిగిన ఒక సంఘటనల గురించి చెబుతూ ఒక పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోతో చేస్తున్న సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. నాతో రెండు రోజులు షూటింగ్ చేయించుకొని తరువాత వాటికి డబ్బులు ఇచ్చేసి, నన్ను సినిమా నుంచి తొలగించి నా ప్లేస్ లో వేరొకరిని పెట్టుకున్నారు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయినది. ఆ హీరో, ఆ డైరెక్టర్ ఇప్పటికి కోలుకోలేదని తన గతాన్ని నెమరువేసుకుంది. నన్ను సినిమాలో నుంచి అకారణంగా తీసేసినందుకు వారికీ నా శాపం గట్టిగా తగిలింది.

ఆడవారి ఉసురు ఊరికే పోదని ఝాన్సీ విషయంలో నిజమైనట్లు ఈ సంఘటన బట్టి తెలుస్తుంది. ఝాన్సీ చెప్పిన ఆ పెద్ద డైరెక్టర్, ఆ పెద్ద హీరో ఎవరనేది ఇప్పుడు సస్పెన్సు గా మారింది. కానీ ఇండస్ట్రీలో ఝాన్సీ పెద్ద పేచీ మనిషని కొంత చెడ్డ పేరు ఉంది, ఝాన్సీ తన వ్యక్తిగత, వివాహ జీవితంతో పాటు ఆర్. నారాయణమూర్తితో పాటు అందరికి ఈమెతో విబేధాలు ఉన్నాయి.