Tuesday, October 8, 2024

Jyothi Rai : బిగ్ బాస్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న జగతి మేడమ్

- Advertisement -

Jyothi Rai : టీవీ నటిగా జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయింది. ఇందులో ఆమె తల్లి పాత్రను పోషించింది. తన వయసు దాదాపు నలభై ఏళ్లు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ పోజులతో యువతను రెచ్చగొడుతోంది. సీరియల్‌లో జగతి మేడమ్‌గా పాపులర్ అయిన జ్యోతిరాయ్ తన హాట్ గెటప్‌లతో తానే కూతురిగా మారిపోయింది. ఈమె హాట్ ఫోటో షూట్ చేస్తే ఎవరైనా సీరియల్ నటే ఆమెకు తల్లి అనుకుంటారు. అంతలా షాకిస్తోంది జనాలకు. కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కన్నడ టీవీ సీరియల్ నటిగా పాపులారిటీ సంపాదించుకుంది.

ఈ బ్యూటీ కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన జ్యోతిరాయ్ తమిళం, కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అలరిస్తోంది. కానీ వయసు రీత్యా ఆమెకు తల్లి, అక్క, వదిన పాత్రలే వస్తున్నాయి. తెలుగులో గుప్పెడంత మనసు టీవీ సీరియల్‌లో జగతి మేడమ్‌గా బాగా పాపులర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు జ్యోతిరాయ్ ని ఎక్కడైనా సరే ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.

రీసెంట్ గా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నలభై ఏళ్ల వయసులో ఇలాంటి హాట్ షూట్ ఫొటోలను చూసి విమర్శించిన వారు కూడా ఉన్నారు. అయినా తన అందాలను రివీల్ చేస్తూ రీసెంట్ గా కొన్ని రొమాంటిక్ ఫోటోలతో ఫోటోలు వదిలింది. షర్ట్ విప్పి లోపల జాకెట్ జిప్ సగానికి తీసి తన ఎద అందాలను చూపిస్తూ జ్యోతిరాయ్ రచ్చ రచ్చ చేసింది. నెటిజన్లంతా జ్యోతిరాయ్ వయసును మర్చిపోయి వావ్ అంటున్నారు. నేటి టాప్ హీరోయిన్లు కూడా ఈ హాట్ నెస్ చూపించడం లేదు… జ్యోతిరాయ్ వయసు ఇరవై ఏళ్లు తగ్గిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ హాట్ ఫోటోలతో షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న జ్యోతిరాయ్ బుల్లితెర ప్రేక్షకులకు మరో షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ సీజన్ 8 కొనసాగుతోంది. మొదటి వారంలోనే బేబక్క వెళ్లిపోయింది. మిగతా కంటెస్టెంట్స్ మొదటి రోజు నుండే ఫైట్ స్టార్ట్ చేసారు. అయితే ఇప్పటి వరకు ఈ రియాలిటీ షోని ఏదో డైలీ సీరియల్ చూస్తున్నట్లు చూస్తున్నారే కానీ కిక్ మాత్రం రావడం లేదు. టీఆర్పీ రేటింగులో కూడా తేడా వచ్చిందని భావించిన బిగ్ బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇతరులకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది. రీతూ చౌదరి వస్తుందని మొన్నటి వరకు ఊహాగానాలు వచ్చాయి. అయితే అంతకంటే ముందు జగతి మేడమ్‌గా పాపులర్ అయిన జ్యోతిరాయ్‌కి అవకాశం ఇవ్వాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ లో జ్యోతిరాయ్ తన అందాలతో ఆకట్టుకుంటుందా? లేక వయసు రీత్యా అందుకు తగినట్లుగా ప్రవర్తిస్తుందా? వేచి చూడాలి అని బిగ్ బాస్ రియాలిటీ షో వీక్షకులు ఎదురుచూస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!