తనకున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యను టాప్ హీరోయిన్ కాజల్ బయటపెట్టింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్.. కాజల్ కున్న వ్యాధి. అప్పటికప్పుడే హఠాత్తుగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం ఈ రోగ లక్షణం. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది. తను ఈ సమస్యతో దాదాపు 3 నెలలు మంచాన పడ్డానని కాజల్ ప్రకటించింది.

ఈ ఏడాది ప్రారంభంలో బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. బాగా రిలాక్స్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే దురదృష్టవశాత్తూ నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. 3 నెలలు అస్సలు లేవలేకపోయాను. పూర్తిగా మంచానికే పరిమితమైపోయాను. ఆ టైమ్ లో నాకు అస్సలు బాగా లేదు. ఈ విషయం చాలా మందికి తెలీదు అని తెలియజేసింది కాజల్. మొత్తానికి తన ఆరోగ్య సమస్య నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని అంటోంది. అందుకే ఆహారం, వ్యాయామం విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని తెలిపింది.

ఏదేమైనా ఇకపై సినిమాలు తగ్గించడం ఖాయమని మాత్రం స్పష్టంచేసింది. కవచం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బయటపెట్టింది కాజల్. నిజానికి ఈ హీరోయిన్ కు ఇంత తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నట్టు ఎవరికీ తెలియదు. కనీసం గాసిప్స్ కూడా బయటకు రాకపోవడం గమరణార్ధం.